మంత్రిని టార్గెట్ చేసిన చంద్రబాబు, అందుకేనా…?

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మనుగడ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా కొంతమంది మంత్రులు పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కారణమేంటో తెలియదుగానీ ఆయన కొన్ని రోజులుగా కొంత మంది మంత్రుల మీద ఎక్కువగా దృష్టి పెట్టి విమర్శలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది.

ప్రధానంగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా దాదాపు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. 850 కి పైగా ఉన్న ఎంపీటీసీ స్థానాల్లో దాదాపు 37 శాతం అంటే 350కి పైగా స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీనిపై ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తన సొంత జిల్లాలో తనను దెబ్బ కొట్టడం పై మంత్రి పెద్దిరెడ్డి ని లక్ష్యంగా చేసుకుని తాజాగా తీవ్ర విమర్శలు చేశారు ఆయన.

మంత్రిగా పనికిరారని ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని ఇలాంటి వాళ్లను తాను ఎప్పుడూ చూడలేదని జిల్లాలో ఇన్నేళ్లుగా రాజకీయం చేస్తున్నాను గానీ ఇటువంటి మంత్రిని ఇప్పుడు దాకా తాను చూసిన పాపాన పోలేదని చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం గమనార్హం. చివరకు తన నియోజకవర్గం కుప్పంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయడంతో చంద్రబాబు ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం గా ఉన్నారు. అందుకే ఆ మంత్రిని టార్గెట్ గా చేసుకుని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version