పప్పులో కాలేసిన బాబు.. కొడుకు లోకేశ్ బాటలోనే.. బహిరంగ సభలో నోరు జారారు..!

-

సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంది. ఏ పార్టీకి చెందిన అభ్యర్థి అయినా రాష్ట్రం మొత్తాన్ని ఒకేలా చూడాలి కానీ.. ఇలా మాట్లాడటం ఏంది..

అందరూ నారా లోకేశ్ ను ఆడిపోసుకుంటారు కానీ.. చంద్రబాబు ఏమన్నా తక్కువ తిన్నారా? ఆయన కూడా నోరు జారుతారు. మామూలుగా కాదు.. ఎంతలా అంటే మీరు వేరే పార్టీ ఎమ్మెల్యేలు.. మీరు చెబితే నేను పనులు చేస్తానా? అని ఎన్నికల ప్రచారంలో అది కూడా బహిరంగ సభలో అంటారా? ఎవరైనా అలా అంటారా? బుద్ధి ఉన్నవాళ్లు ఎవరూ అనరు అంటారా? కానీ.. చంద్రబాబు అన్నారు. అదే ఇప్పుడు చంద్రబాబుకు మరో తలనొప్పి తీసుకొచ్చింది. వైసీపీకి టీడీపీని విమర్శించడానికి మరో బ్రహ్మాస్త్రం దొరికింది. ఊరికే నారా లోకేశ్ బాబును ఆడిపోసుకోవడం కాదు.. ఆయన తండ్రి చంద్రబాబు మాట్లాడే మాటలు కూడా వింటే అర్థం అవుతుంది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇవాళ కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో బాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన బాబు.. నోరు జారి అడ్డంగా బుక్కయ్యారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితను పొడగబోయి అడ్డంగా బుక్కయ్యారు. అప్పుడు గౌరు చరిత వైసీపీలో ఉన్నారు. తర్వాత టీడీపీలో చేరారు.



నేను ఇక్కడికి ఏ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినా గౌరుచరిత నాకు వినతి పత్రాలు ఇచ్చేవారు. మా ప్రజలకు అవి చేయండి.. ఇవి చేయండి అంటూ కోరేవారు. కానీ.. నేను ఆ పనులేవీ చేయలేదు. ఎందుకంటే ఆమె అప్పుడు వేరు పార్టీలో ఉన్నారు.. కాబట్టి చేయనని చెప్పాను అంటూ చిరునవ్వు చిందిస్తూ ప్రసంగించారు చంద్రబాబు. అదే ఇప్పుడు చంద్రబాబుకు లేనిపోని టెన్షన్లను తీసుకొచ్చింది.

సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంది. ఏ పార్టీకి చెందిన అభ్యర్థి అయినా రాష్ట్రం మొత్తాన్ని ఒకేలా చూడాలి కానీ.. ఇలా మాట్లాడటం ఏంది.. అంటూ చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం.. చంద్రబాబు వ్యాఖ్యలు ఎటువంటి దూమారం రేపుతాయో?

Read more RELATED
Recommended to you

Exit mobile version