రాష్ట్రంలోని కరువుకు కాళేశ్వరమే కారణం : సామ రామ్మోహన్ రెడ్డి

-

రాష్ట్రంలో కరువు రావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కారణమని కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఏర్పడిన కరువు.. కమీషన్లకు కక్కుర్తి పడి లక్షా నలభై ఏడు వేల కోట్లు పెట్టి, కూలిన కాళేశ్వరం కట్టిన కచరా తెచ్చిన కరువు అంటూ సామ రామ్మోహన్ ఫైర్ అయ్యారు.

Sama Rammohan Reddy

పదేళ్లు కృష్ణ పరీవాహక ప్రాజెక్టులను పట్టించుకోకుండా రాయలసీమ రాగి సంకటి..నాటు కోడి పులుసు తిని తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టిన కల్వకుంట్ల దొంగలు మిగిల్చిన కరువు అంటూ బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.మీ పదేళ్ల పాలనతో పాటు నేటికీ కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల మీదనో లేదా కాలం మీదనో ఆధారపడి జీవించే పరిస్థితి వచ్చిందన్నారు. మీరు కట్టిన ప్రాజెక్టులతో మీ కుటుంబం జేబులు మాత్రమే నిండాయి తప్పా.. రాష్ట్రంలోని చెరువులు నిండలేదంటూ ఘాటు వ్యాక్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version