బీసీ నేతలతో సీఎం రేవంత్ సమావేశం ప్రారంభం

-

రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అందుకోసం ఏడుగురు మంత్రులను రంగంలోకి దింపింది.

అంతేకాకుండా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ నేతలకు ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై సీఎం రేవంత్ ఇటీవల దిశానిర్దేశం చేశారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల గురించి.. కులగణన సర్వే ఆధారంగా రిజర్వేషన్లు ఎలా వర్తింపజేయాలనే అంశంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతుంది. రాష్ట్రంలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అములు కావాలంటే కేంద్రం చట్టం చేయాల్సిందే. ఈ క్రమంలోనే ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. దీనికి డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ నాయకుడు వీహెచ్, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీసీ నేతలు హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్ బిల్లు మీద ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై ఈ భేటీలో చర్చిస్తారని టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version