వివాదాస్పదంగా మారిన చంద్రబాబు లేఖ, 16 వేల ఫలితాలు ఎక్కడ…?

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పరిక్షలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసారు. ఈ లేఖలో ఆయన సంచలన విషయాలను ప్రస్తావించారు. కరోనా వ్యాప్తికి నియంత్రణ చర్యలపై ఆయన ఏపీ సియేస్ నీలం సహానికి ఒక లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్‌లో 16,000 కరోనా పరీక్షల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన ఆరోపణలు చేసారు.

రాష్ట్రంలో సరైన సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరగడం లేదన్న ఆయన… కరోనా పరీక్షలు నిర్వహించే టెస్ట్ కిట్లు కూడా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 16,000 కరోనా పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని, కరోనా నిర్ధారణ విషయంలో ఈ ఫలితాలు రావడం చాలా ప్రధానమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

కరోనా నిర్ధారణకు వీలైనంత ఎక్కువగా పరీక్షలు చేయాలని సూచించారు. అదే సమయంలో పరీక్షల ఫలితాలు త్వరగా రావడం కూడా ప్రధానమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నా.. అందులో 16,000 పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉందన్నారు ఆయన. రాష్ట్రంలో టెస్టింగ్ ల్యాబ్స్ సరిపడా అనుమతి ఇవ్వకపోవడంతో ఈ ప్రక్రియ అంతా ఆలస్యం అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. 16 వేల పరిక్షల ఫలితాలు తెలియకపోతే ఇబ్బంది పడతామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version