మాస్క్ లు కుడుతున్న రాష్ట్రపతి సతీమణి…!

-

కరోనా వైరస్ తీవ్రత నేపధ్యంలో అందరూ కూడా మాస్క్ లు వాడాలని వైద్యులు ప్రభుత్వాలు పదే పదే సూచనలు చేస్తున్నాయి. ప్రజలు అందరూ కూడా మాస్క్ లేకుండా బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ప్రతీ ఒక్కరు కూడా దీనిపై అవగాహన కలిగించే కార్యక్రమాలు చేస్తున్నారు. దీనితో ప్రజలు కూడా మాస్క్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. మాస్క్ లేకుండా ఎవరూ కూడా బయటకు రావడం లేదు.

ఈ నేపధ్యంలో మాస్క్ లను కుట్టడానికి అందరూ సిద్దమవుతున్నారు. తాజాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భార్య సవితా కోవింద్ ఏప్రిల్ 22 న ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోని శక్తి హాట్ వద్ద ఫేస్ మాస్క్‌లు కుట్టారు. సవితా కోవింద్ తయారు చేసిన మాస్క్ లను అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డులోని పలు షెల్టర్ హోమ్స్ లో పంపిణి చేస్తారు. శక్తి హాట్ వద్ద కుట్టు యంత్రం సహాయంతో ముసుగులు కుడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆమె ఎర్రటి మాస్క్ ధరించి కుడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కర్ణాటక బిజెపి దీనిపై సోషల్ మీడియాలో పోస్ట్ లు చేసింది. “ఇక్కడ మన ప్రథమ మహిళ, శ్రీమతి సవితా కోవింద్, న్యూ ఢిల్లీ లోని అనేక షెల్టర్ హోమ్స్ లో పంపిణీ చేయవలసిన ఫేస్ మాస్క్‌లను కుట్టారు. ఈ పని చేసినందుకు గాను అమ్మకు ధన్యవాదాలు. దాదాపు అన్ని రాష్ట్రాలు మాస్క్ లను తప్పనిసరి చేసాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version