వంగవీటి వారసుడి విషయంలో బాబు కీలక నిర్ణయం…!

-

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ బలపడటానికి గానూ కీలక ప్రయత్నాలు చేస్తుంది. ప్రజల్లోకి వెళ్ళడానికి టీడీపీ నేతలు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రజలను మచ్చిక చేసుకోవడానికి సేవా మార్గం లో ఎక్కువగా పయనిస్తున్నారు. ప్రతీ రోజు కూడా కరోనా బాధితులకు ఏదోక సేవ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కవర్ అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ నేతలు.

ఇది పక్కన పెడితే ఇప్పుడు కొందరు యువనేతలు ఇప్పుడు ప్రజల్లో ఉండే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. అందులో వంగవీటి మోహన్ రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఒకరు. రాజధాని ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ నేతలు ఎవరు వచ్చినా రాకపోయినా సరే ఆయన మాత్రం రాజధాని ఉద్యమ౦లో పాల్గొంటున్నారు. దీనితో ఆయనకు కీలక పదవి ఇవ్వడానికి చంద్రబాబు రెడీ అయ్యారు. ఆ పదవి ఏంటీ అంటే…

కృష్ణా జిల్లా పార్టీ బాధ్యతలను అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన దూకుడు ఉన్న నేత. ఆర్ధికంగా బలంగా లేకపోయినా సరే ప్రజల్లో ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి ఆయనకు ఆ బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నారు. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న జిల్లా కృష్ణా జిల్లా. అలాగే వంగవీటి కుటుంబానికి కూడా ఎక్కువగా పట్టు ఉన్న జిల్లా. దీనితోనే ఆయనకు పదవి ఇవ్వడానికి రెడీ అయ్యారు.

ఇప్పటికే ఈ విషయాన్ని జిల్లా పార్టీ నేతలకు సూచించారు అంటున్నారు. వాళ్ళు కూడా దీనికి అంగీకారం తెలిపినట్టు సమాచారం. దేవినేని ఉమా, కేసినేని నానీ సహా కొందరు నేతలను అడగగా వాళ్ళు అందుకు ఏ ఇబ్బందులు చెప్పలేదు అంటున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పుడు కరోనా సేవల్లో కూడా ఆయన ఎక్కువగా పాల్గొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version