జగనన్న… కేసీఆర్ కూడా కామెంట్ చేస్తున్నారు..!

-

రాష్ట్ర విభజన జరిగాక ఏపీ కంటే తెలంగాణ అన్నీ రంగాల్లో ముందుందని సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నారు. ఆయన రెండోసారి అధికారంలో కొనసాగుతూ…రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంచానని చెప్పుకుంటున్నారు. అయితే కేసీఆర్ ఏం చేశారో చెప్పడానికి…ప్రతిసారి పక్కనే ఉన్న ఏపీతో పోల్చి చెబుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ రంగంలో తెలంగాణ ముందు ఉందని, అలాగే ఏపీలో కంటే తెలంగాణలోనే భూమి ధరలు ఎక్కువగా ఉన్నాయని అనేక సందర్భాలు చెప్పుకొచ్చారు.

kcr-jagan

అంటే ఏపీలో పరిస్తితులు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. తాజాగా టీఆర్‌ఎస్ ప్లీనరి సభలో కేసీఆర్…ఈ ఏడు ఏళ్లలో తెలంగాణకు ఏం చేశారో బాగా డప్పు కొట్టుకున్నారు. అలాగే తన పాలన అద్భుతంగా ఉందని ఆయనకు ఆయనే కితాబు ఇచ్చుకునే పరిస్తితి. ఇదే సమయంలో ఏపీ పర్ క్యాపిట ఆదాయం లక్షా70వేల కోట్లు, తెలంగాణ పర్ క్యాపిట ఆదాయం 2లక్షల ముప్పై వేల కోట్లు అని, నేడు తెలంగాణలో 24 గంటల కరెంట్, ఏపీలో కరెంట్ కోతలు ఉన్నాయని మాట్లాడారు. ఇక ఎక్కడి తెలంగాణ, ఎక్కడి ఏపీ.. అసలు ఇప్పుడు రెండు రాష్ట్రాలకు పొంతనే లేదంటూ….తనదైన శైలిలో ఏపీపై కౌంటర్లు వేసేశారు.

అంటే పక్క రాష్ట్రం సీఎం సైతం కామెంట్ చేసేలా ఏపీలో పరిస్తితులు ఉన్నాయా? అంటే కాదని చెప్పలేమనే ఇక్కడి రాజకీయ వర్గాల నుంచి సమాధానం వస్తోంది. ఎందుకంటే ఆదాయం ఎలాగో పడిపోయింది…అప్పులే మీద ఏపీలో బండి నడుస్తుందని చెప్పాల్సిన పని లేదు. అయితే ఇంతవరకు ఏపీలో కరెంట్ కోతలు లేవు..కానీ ఇటీవల అనూహ్యంగా కరెంట్ కోతలు పెరిగాయి. ఎలాగో కరెంట్ చార్జీల బాదుడు ఓ రేంజ్‌లో ఉన్నాయి. దానికి తోడు కోతలు కూడా…ప్రభుత్వ అధికారులు కోతలు ఉండవని చెబుతారు…కానీ అనధికార కోతలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా కరెంట్ కోతలు ఉంటున్నాయి. అందుకే అనుకుంటా తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం కామెంట్ చేసేలా ఏపీలో పరిస్తితులు ఉన్నట్లున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version