కేసీఆర్ రాజకీయాలు ఎంతో దూరదృష్టితో ఉంటాయనేది అందరికీ తెలిసిందే. ఆయన ఏ పని చేసినా అందులో తన భవిష్యత్ రాజకీయాలకు పనికొచ్చే విధంగా చూసుకుంటారు. ఇక ప్రస్తుతం ఏపీ, తెలంగాణ ప్రాంతీయ సెంటిమెంట్ విషయంలో పెద్ద ఎత్తున వివాదాలు రాజుకుంటున్న సందర్భంగా మరోసారి అగ్గిరాజేసే పనిలో పడ్డారు కేసీఆర్. రీసెంట్ గా ఆయన ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలవడంతో అందరూ అయోమయంలో పడ్డారు. అసలు ఆయన ఎందుకు కలిశారో స్పష్టంగా తెలియకపోవడంతో అంతా టెన్సన్ పడుతున్నారు.
అయితే పైకి రాజకీయం లేనట్టు కనిపిస్తున్నా కూడా ఇందులో అసలు కారణం వేరే ఉందంట. అసలు తెలంగాణ, ఏపీ విడిపోయిన సమయంలో ఉన్న విభజన చట్టం హామీల కోసం జగన్ కూడా గతంలో చాలాసార్లు సీఎం హోదాలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి వాటిని గుర్తు చేశారు. తమ రాష్ట్రం ఎక్కువగా నష్టపోయిందని, కాబట్టి కేంద్రం తరఫున విభజన చట్టం ప్రకారం ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరినా పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
అయితే ఇప్పుడు కేసీఆర్ మాత్రం మరోసారి మోడీని కలిసి రాష్ట్రాల విభజన సందర్భంగా ఏర్పాటు చేసిన విభజన చట్టంలో ఉన్న హామీలను తెలంగాణకు అమలు చేయాలని కోరడం ఏపీకి షాక్ ఇస్తోంది. ఎందుకంటే విభజన వల్ల ప్రధానంగా నష్టపోయింది ఏపీ రాష్ట్రమే. కానీ తెలంగాణ మాత్రం మిగులు బడ్జెట్ తో ఏర్పడినా ఇప్పుడు ఏపీకంటే కూడా తెలంగాణకే ఎక్కువగా ప్రాజెక్టులు. ప్రత్యేక నిధులు కావాలని కేసీఆర్ కోరడం ఒకింత ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే అవుతోంది. అయితే నష్టపోయిన తమకు ఇవ్వకుండా తెలంగాణకు ఎలా ఇస్తారంటూ వైసీపీ మంత్రులు కూడా భగ్గుమంటున్నారు. ఏదేమైనా సీఎం కేసీఆర్ మరోసారి ఏపీని రెచ్చగొట్టే రాజకీయాలు చేశారు.