ఏపీలోని నంద్యాల జిల్లా ముష్టపల్లిలో దారుణం చోటుచేసుకుంది. నీరు తెచ్చుకునేందుకు వెళ్లిన ఓ వృద్దురాలు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. రక్షించాలని ఆమె కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి వెంటనే ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
చీరల సాయంతో వృద్ధురాలని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇద్దరు ఈతగాళ్లను సైతం బావిలోకి దించారు. వారు కూడా వృద్ధురాలు నీట మునగకుండా సాయం చేశారు. ఎట్టకేలకు పోలీసులు వృద్దురాలి ప్రాణాలను రక్షించారు.దీంతో స్థానికులు పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రమాదం జరిగిన తీరును , వృద్ధురాలిని రక్షించిన తీరును పొలీసులు వివరించారు.
పోలీసన్నా…శభాష్
పోలీసుల సహకారంతో ప్రాణాపాయం నుంచి బయటపడిన వృద్దురాలు
నీటి కోసం వెళ్లి బావిలో పడిన వృద్దురాలు..కాపాడండి అంటూ కేకలు
అటు వైపు నుంచి వెళ్తుండగా గమనించి రక్షించిన ఆత్మకూరు పోలీసులు
నంద్యాల జిల్లా ముష్టపల్లిలో ఘటన..పోలీసులపై పెద్దఎత్తున ప్రశంసలు#APPolice… pic.twitter.com/MdRcz1fPPT
— Pulse News (@PulseNewsTelugu) November 20, 2024