ఎమ్మెల్సీ కోదండరాంకి ప్రభుత్వంలో కీలక పదవి.. సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ ఇదే..

-

ఎమ్మెల్సీ కోదండ రామ్ కి ప్రభుత్వంలో కీలకపదవి రాబోతుందా..? టిఆర్ఎస్ మోసం చేసిన నేతల్ని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకి తీసుకుంటున్నారా..? కాంగ్రెస్ పార్టీకి కోదండరాం సేవలు ఉపయోగపడతాయా?? ప్రస్తుతం ఇవే చర్చలు తెలంగాణ కాంగ్రెస్ లో జోరుగా సాగుతున్నాయి.. ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కోదండరాంకి ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట..

Revanth Reddy

తెలంగాణకు విద్యాశాఖ మంత్రిగా కోదండరాం రాబోతున్నారని చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ రథసారధిగా కోదండరాం అనేక ఉద్యమాలు చేశారు. కెసిఆర్ తో కలిసి అప్పటి కాంగ్రెస్పై ఒత్తిడి తీసుకొచ్చారు.. ఈ క్రమంలో తెలంగాణ సెంటిమెంట్ తో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.. అప్పట్నుంచి కోదండరాంని కేసీఆర్ దూరం పెడుతూ వచ్చారు.. కోదండరాంని తొక్కేసేందుకు తెలంగాణ జేఏసీలో కొందరికి సహాయ సహకారాలు అందించడంతో కోదండరాం కనుమరుగయ్యారు.. కెసిఆర్ తన పట్ల అవమానకరంగా ప్రవర్తించి.. తన మనోభావాలను దెబ్బతీశారు అంటూ కోదండరామ్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు..

టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న మేధావులను, ప్రొఫెసర్లను కాంగ్రెస్ పార్టీ దగ్గరకు తీసుకుంటుంది. ఇటీవల కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.. కాంగ్రెస్ పార్టీపై అతనికి సానుకూల అభిప్రాయం ఉన్న నేపథ్యంలో.. అతన్ని ప్రభుత్వంలో భాగం చేసుకోవాలని ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారట.. క్యాబినెట్లో కీలక పదవిగా ఉన్న విద్యా శాఖను ఆయనకు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులు అందరూ ఒకచోట చేరి.. పార్టీ ఇమేజ్ ని డామేజ్ చేయబోతున్నారని తెలంగాణ రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. నిజంగా కోదండరాంకి మంత్రి పదవి వస్తుందా లేక.. కాంగ్రెస్ పార్టీ కావాలని ఈ ప్రచారానికి ఆజ్యం పోస్తుందా అనేది చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Exit mobile version