ప్రధాని మోడీ పర్యటన.. సీఎం రేవంత్​రెడ్డి సంప్రదాయాన్ని పాటిస్తారా?

-

ఈ నెల 4, 5వ తేదీల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో రాజకీయ సభల్లోనూ పాల్గొనున్నారు. అయితే, సీఎం రేవంత్​రెడ్డి ప్రోటోకాల్​ పాటిస్తారా? లేదా కేసీఆర్​ బాటలో నడుస్తారా? అనే అంశం ఆసక్తికరంగా మారింది.
ప్రధాన మంత్రి పర్యటన సమయంలో ప్రోటోకాల్​ ప్రకారం ఆహ్వానాలు ఉంటాయి. గవర్నర్​, సీఎం, అధికారులు స్వాగతం పలకడం సంప్రదాయం.

బీజేపీతో సత్సంబంధాలు ఉన్నంత కాలం బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ఈ సంప్రదాయాలను పాటించారు. బీఆర్​ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీతో సంబంధాలు బెడిసి కొట్టాయి. ప్రధాని మోడీ ఎప్పుడు రాష్ట్ర పర్యటనకు వచ్చినా సీఎం కేసీఆర్​ ఆహ్వానం పలకలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ మాత్రమే వెళ్లి ప్రధానికి స్వాగతం పలికేవారు. గవర్నర్​తో సైతం ప్రోటోకాల్​ విషయంలో పెద్ద రాద్దాంతమే జరిగిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కేసీఆర్​కు భిన్నంగా రేవంత్​రెడ్డి నడుచుకుంటున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గవర్నర్​ను కలవడం ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి, కేంద్ర హోంమంత్రుల సైతం భేటీ అయ్యారు.

ప్రస్తుతం దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. దీనిని దృష్టిలో పెట్టుకొనే ప్రధాన మంత్రి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. 4న ఆదిలాబాద్​లో రూ.6600 కోట్ల పనులకు శంకుస్థాపనతోపాటు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 5న సంగారెడ్డిలో 9 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్​రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకుతారా లేక కేసీఆర్ బాటలో నడుస్తారా అనే విషయం ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version