కారుని కమ్యూనిస్టులు కాపాడతారా?

-

ఇప్పుడు మునుగోడులో గెలుపు టీఆర్ఎస్ పార్టీకి చావో రేవో లాంటిది అయిపోయింది…ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఉపఎన్నికల్లో ఓడిపోతే అంతకంటే ఆ పార్టీకి పెద్ద డ్యామేజ్ ఏది ఉండదు…దీని వల్ల ప్రజల్లో నమ్మకం కోల్పోతుంది. అయితే ఇప్పటికే బీజేపీ దెబ్బకు రెండు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది…ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు సెమీఫైనల్ గా జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికలో గాని టీఆర్ఎస్ ఓడిపోతే అంతే సంగతులు.

ఇప్పటికే ఓ వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన నాయకుడుని చేర్చుకోవడంతో పాటు…మునుగోడులో బలంగా ఉన్న కాంగ్రెస్, టీఆర్ఎస్ స్థానిక నేతలని లాగేస్తూ బీజేపీ దూకుడు మీద ఉంది. అటు తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని కాంగ్రెస్ పనిచేస్తుంది. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతుంది. కానీ ఎలాగోలా ఈ ఉపఎన్నికలో గెలిస్తే ఇబ్బంది లేదు…ఓడిపోతేనే టీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ.

అందుకే ఆ దెబ్బ తగలకుండా ఉండాలని చెప్పి టీఆర్ఎస్ సైతం తనదైన శైలిలో రాజకీయం చేసుకుంటూ వెళుతుంది. అధికార బలాన్ని ఉపయోగించి…మునుగోడులో సత్తా చాటాలని చూస్తుంది. అయితే అంతకముందు ఉమ్మడి నల్గొండలో జరిగిన హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది…ఇక ఇప్పుడు మునుగోడులో కలిసొస్తుందని భావిస్తుంది.

అయితే హుజూరాబాద్ ఉపఎన్నిక మాదిరిగా మరీ దూకుడుగా కాకుండా ఈ సారి పక్కా వ్యూహాలతో ముందుకెళ్లడానికి చూస్తుంది. ఇదే క్రమంలో కీలకమైన కమ్యూనిస్టుల మద్ధతు కూడగట్టుకుంది. ఇప్పుడు మునుగోడులో కారుని కమ్యూనిస్టులే ఒడ్డుకు చేర్చాల్సిన పరిస్తితి ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ ఉంది…కానీ కాస్త వ్యతిరేకత ఓటు బ్యాంక్ బీజేపీ వైపు వెళ్ళేలా ఉంది..దీని వల్ల టీఆర్ఎస్ పార్టీకి గెలుపు కావాల్సిన ఓట్లు పడేలా లేవు. మునుగోడులో బలంగా ఉన్న సి‌పి‌ఐ సపోర్ట్ ఇవ్వడం టీఆర్ఎస్‌కు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. గతంలో సి‌పి‌ఐ ఇక్కడ అయిదుసార్లు గెలిచింది..తర్వాత నుంచి ఆ పార్టీ బలం తగ్గింది. గెలుపు అవకాశాలు లేవు గాని..సుమారు 20 వేల ఓట్ల బలం మాత్రం ఉంది…అటు సి‌పి‌ఎంకు దాదాపు 5 వేల ఓట్ల బలం ఉంది..ఈ ఓట్లు గాని టీఆర్ఎస్ పార్టీకి షిఫ్ట్ అయితే ఇంకా తిరుగుండదు. మరి చూడాలి కారుకు కమ్యూనిస్టులు ఎంత ప్లస్ అవుతారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version