కేటీఆర్ ను అరెస్టు చేస్తే.. లాభమా..? నష్టమా..? వెనకడుగు వేసిన కాంగ్రెస్..

-

కేటీఆర్ త్వరలో అరెస్టు కాబోతున్నారంటూ.. కాంగ్రెస్ నేతలు పేల్చిన బాంబులకు తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది.. ఐదు కేసుల్లో కేటీఆర్ తప్పించుకోలేరని.. ఏ క్షణమైనా అరెస్టు తప్పదంటూ బాంబులు పేల్చారు హస్తం పార్టీ నేతలు.. తీరా ఇప్పుడు వెనకడుగు వేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది.. ఇంతకీ కాంగ్రెస్ నేతల మదిలో ఏముందంటే..?

ప్రతి సందర్బంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ఇరుకున పెడుతున్నారు.. అవకాశం చిక్కినప్పుడల్లా ఘాటైన విమర్శలు చేస్తూ.. పొలిటికల్ మైలేజ్ సంపాదించుకుంటున్నారు.. ఈ క్రమంలో అతని దూకుడుకు కళ్లెం వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.. హరీష్ రావును హైప్ చేసి.. వారిద్దరి మధ్య వర్గ విభేదాలుతీసుకురావాలని ప్రయత్నించారు..అది కూడా వర్కౌట్ అవ్వలేదు.. దీంతో కేటీఆర్ కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ సీరియస్ గా దృష్టి పెట్టింది..

గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ విచారణ జరుపుతున్నామని చెబుతున్న హస్తం పార్టీ నేతలు.. కేటీఆర్ మీద ఐదుకేసులు నమోదు చేశారు.. అరెస్టు చేస్తే కేటీఆర్ సైలెంట్ అవుతారని భావించిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. ప్రస్తుతం అరెస్ట్ చేస్తే లాభమా..? నష్టమా అన్న డైలామాలో ఉన్నారట.. కేటీఆర్ ను ఏదో ఒక దాంట్లో కార్నర్ చేసి జైలుకు పంపాలని ఓ వర్గం కాంగ్రెస్ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారట..

ఐదు కేసుల్లో ఏదో ఒక కేసులో జైలుకు పంపాలని భావించిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆలోచనలో పడిందట.. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న సమయంలో.. ఇప్పుడు కేటీఆర్ ను అరెస్టు చేస్తే బీఆర్ఎస్ కు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్న మెసేజ్ ప్రజల్లోకి వెళ్తే..అది స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముంటుందని ఆయన ఆలోచనలో పడ్డారట..

టైమ్ చూసుకుని.. ఫార్ములా రేస్ లో అరెస్టు చేసి.. అవినీతి జరిగింది కాబట్టే అరెస్టు చేశామని చెప్పుకోవచ్చని.. ఆ దిశగా ఆలోచించాలని పలువురు సీనియర్లు సీఎం రేవంత్ రెడ్డిని కోరారట..దీనిపై అధిష్టానంతో మాట్లాడి.. ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీలో చర్చ నడుస్తోంది.. నిజంగానే కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా.. లేక బీఆర్ఎస్ ను భయపెట్టేందుకే కాంగ్రెస్ నేతలు లీకులు ఇస్తున్నారా అనేది చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version