కల్వరి టెంపుల్ పై హైకోర్టు లో పిటిషన్ దాఖలు..!

-

గుంటూరు జిల్లా నంబూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్వరి టెంపుల్ కు ఇటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు అంటూ పరస సురేష్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్డింగ్ రూల్స్ 26 ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా వందల కోట్లతో కట్టడాలు నిర్మించారన్నారు పిటిషనర్. సి ఆర్ డి ఏ మరియు రెవెన్యూ అధికారుల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రమాదకరమైన కట్టడాలు నిర్మించటం చట్టవిరుద్ధం అన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది.

పంచాయతీరాజ్ నిబంధనలకు అనుగుణంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాజకీయ నాయకుల అండదండలతో కట్టడాలు నిర్మించారన్న పిటీషనర్ న్యాయవాది.. తక్షణమే ఆ కట్టడాలను కూల్చివేయాలి అంటూ వాదనలు చేసారు. ఇక పిటిషనర్ న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. తక్షణమే కల్వరి టెంపుల్ యాజమాన్యాలకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version