వరంగల్ విజయోత్సవ సభలో దారుణం.. వరద బాధితులకు వేసినట్టు పులిహోర పొట్లాలు..!

-

వరంగల్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయోత్సవ సభలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విజయోత్సవ సభకు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అక్కడికి వచ్చినటువంటి మహిళలకు వరద బాధితులకు పొట్లాలు విసిరినట్టు పులిహోర, అన్నం ప్యాకెట్లను విసిరుతున్నారు. ఇలా విసిరే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

warangal

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విజయోత్సవ సభలు పెడుతున్నారు. తాజాగా వరంగల్ లో విజయోత్సవ సభ నిర్వహించారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. అలాగే కాళోజీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం అక్కడ కాళోజీ జీవిత విశేషాలు తెలిపేలా ఏర్పాటు చేసే ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version