‘న‌న్ను చంప‌డానికి కుట్ర జ‌రుగుతోంది’ : ర‌ఘురామ‌ సంచ‌ల‌నం

త‌న‌ను చంప‌డానికి కుట్ర జ‌రుగుతోంద‌ని అంటూ వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను హ‌త్య చేయ‌డానికి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక ముఠాతో కొంత మంది చ‌ర్చ‌లు జ‌రిపార‌ని ఎంపీ ర‌ఘురామ ఆరోపించారు. ఈ విష‌యంపై తాను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ లేఖ రాస్తాన‌ని ఆయ‌న అన్నారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎవ‌రైనా న‌చ్చక పోతే.. వారిని తీసి వేస్తార‌ని అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ysrcp mp raghurama krishnamraju to respond on notices issued by party

త‌న‌ను కూడా హ‌త్య చేయాల‌ని భావిస్తున్నార‌ని ఆరోపించారు. దీని కోసం జార్ఖండ్ లో ఉండే రౌడీలతో చ‌ర్చ‌లు జ‌రిపి సుఫారీ కూడా ఇచ్చార‌ని ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజ్ ఆరోపించారు. అలాగే మెగా స్టార్ చిరంజీవిని అల్లరి చేయ‌డానికే రాజ్యస‌భ సీటు అంటూ నాట‌కాలు ఆడార‌ని అన్నారు. కావాల‌నే వైసీపీ మెగాస్టార్ చింజీవికి రాజ్య‌స‌భ సీటు అంటూ ప‌త్రికాల‌లో రాయించార‌ని ఆయ‌న ఆరోపించారు. అలాగే ఏపీ సీఎం జ‌గ‌న్ ఇచ్చే విందుకు మెగాస్టార్ చిరంజీవి వెళ్లాల్సిన అవ‌సరం చిరంజీవికి లేద‌ని అన్నారు.