నిత్యం మీడియాతో టచ్‌లో ఉంటూ.. అధికార పక్షంపై విరుచుకుపడే ప్రతిపక్షాలు, ప్రతి పక్షాల విమర్శల ను తిప్పికొట్టే అధికార పార్టీ నేతలు ఇప్పుడు తమ నోటికి మాస్క్ కట్టుకున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో ఎవరూ కూడా మీడియా సమావేశాలు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. అదేసమయంలో పొలిటికల్ పార్టీల యాక్టివిటీ కూడా పూర్తిగా నిలిచిపోవడంతో నాయకులకు పెద్దగా పనిలేకుండా పోయింది. దీంతో ఎవరికి వారు మౌనం పాటిస్తున్నారు. ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
మహిళా నాయకురాళ్లు.. ఇళ్లలో తమదైన శైలిలో కుటుంబం బాధ్యతలు చూస్తున్నారు. కుటుంబ సభ్యులకు స్వయంగా వంటచేసి పెడుతున్నారు. ఉదాహరణకు సాక్షాత్తూ.. రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరి త.. ఇంటికే పరిమితమయ్యారు. తన కుటుంబానికి స్వయంగా వంట చేసి పెడుతూ.. అచ్చు గృహ లక్ష్మిని తలపించారు. అదేవిదంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఇక, నాయకు లు కూడా ఇళ్లకు, ఫాం హౌస్‌లకు పరిమితమయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏకంగా ఏపీకి దూరంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. తొలిరోజు మనవడికి పాఠాలు చెబుతూ టైం పాస్ చేశారు. ఇక, మిగిలిన టీడీపీ నేతలు కూడా ఇళ్లలోనే ఉన్నారు. ఒక్కరిద్దరు మాత్రం సీఎం జగన్ ప్రెస్‌మీట్‌పై స్పందిస్తూ.. విమర్శలు చేశారు. మిగిలిన వారు అది కూడా చేయలేదు. మొత్తంగా చూ్స్తే.. నిత్యం రాజకీయ నేతల విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో రగిలిపోయే రాష్ట్రంలో ఒక్కసారిగా మౌన ముద్ర దాల్చింది. కరోనా ఎఫెక్ట్ జనజీవనంపైనే కాకుండా రాజకీయాలపైనా ప్రబావం చూపిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.