కరోనా వైరస్ ని ఎదుర్కొనటం కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్ నిబంధనల కారణంగా అనేకమంది అవస్థలు పడుతున్న విషయం అందరికీ తెలిసినదే. ఎక్కువగా పేదవాళ్ళు లాక్ డౌన్ వల్ల పనులు లేకపోవడంతో ఆహారం కోసం ఎవరైనా సహాయం చేస్తారా అన్న పరిస్థితిలో కి వెళ్ళిపోయారు. ప్రభుత్వాలు సహాయం చేస్తున్న కాని అవి కొద్దిరోజులకు మాత్రమే రావడంతో… అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగస్తులు మరియు విద్యార్థులు కూడా లాక్ డౌన్ వల్ల తమ భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్నారు.
లాక్ డౌన్ కారణంగా స్కూళ్లు తెరిచే పరిస్థితి రివిజన్ లేకపోవడంతో పరీక్షలు ఎదుర్కోవటానికి విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రముఖ కార్పోరేట్ స్కూల్స్ మాత్రం ఆన్లైన్ పాఠాలు చెబుతూ పిల్లలను పరీక్షలకు రెడీ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని తల్లిదండ్రులు తెగ ఆందోళన చెందుతున్నారు.