ఫోన్ కొట్టు – ఆహారం పట్టు : పైత్యం తలకి ఎక్కిందా ?

-

కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి టైమ్ లో కొంత మంది రాజకీయ నాయకులు సమస్యపై పోరాడకుండా పైత్యం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడి విషయంలో ప్రభుత్వాలు ఎక్కడికక్కడ సోషల్ డిస్టెన్స్ మరియు వ్యక్తిగత పరిశుభ్రత గురించి అనేక సూచనలు ఇస్తుంది. ఇలాంటి వాటిపై రాజకీయ నాయకులు ఏమాత్రం ప్రజలకు అవగాహన కల్పించకుండా..ఏదో సహాయం చేస్తున్నట్టు తెగ ఫోజులు కొడుతూ దిగజారుడు. రాజకీయాలకు పాల్పడుతున్నారు. తాజాగా చీరాల నియోజకవర్గంలో ఒక ప్రముఖ నాయకుడు కుమారుడు… లాక్ డౌన్ విధించిన సమయంలో వైరస్ బాగా సోకుతున్న తరుణంలో ఎక్కడ కూడా నియోజకవర్గంలో కనబడలేదు. అంతేకాకుండా సోషల్ డిస్టెన్స్ మరియు వ్యక్తిగత పరిశుభ్రత గురించి కూడా నియోజకవర్గ ప్రజలకు ఏమాత్రం సూచనలు, జాగ్రత్తలు కూడా చెప్పకుండా మొన్నటివరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇటువంటి తరుణంలో తాజాగా అజ్ఞాతం వీడి బయటకు వచ్చి సదరు రాజకీయ నాయకుడు నియోజకవర్గంలో ‘ఫోన్ కొట్టు – ఆహారం పట్టు’ అని అంటున్నాడు. దీంతో ఒక్కసారిగా చీరాల నియోజకవర్గ ప్రజలు షాక్ తిన్నారు.

 

మొన్నటి వరకు కనబడని ఇతను, ఇప్పుడు ఏంటి ఇంత హడావిడి చేస్తున్నారు అంటూ తెగ డిస్కషన్ చేస్తున్నారట. అసలు కరోనా వైరస్ నియోజకవర్గ పరిధి లో విజృంభిస్తున్న తరుణంలో ఏమైపోయారు ఇతను అంటూ మరికొంతమంది తాజాగా ఆయన పిలుపునిచ్చిన కార్యక్రమం పై మండిపడుతున్నారు. ప్రజల ఆరోగ్యం కాకుండా రాజకీయ పైత్యం తలకెక్కితే ఈ విధంగానే వ్యవహరిస్తారు అంటూ మరికొంతమంది ఘాటుగా స్పందిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version