బీజేపీ పాలిత ప్రభుత్వాల కన్నా తెలంగాణ రాష్ట్రం లో అభివృద్ధి విషయం లో కోటి రేట్లు బెటర్ గా ఉన్నామని ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో చాలా అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ లో అమలు అవుతున్న అభివృద్ధి పథకాలు ఏ బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలు అవుతున్నాయో చూపెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి సవాల్ విసిరాడు.
నకిలీ విత్తనాలు అమ్మకం ఉక్కు పాదం తో తొక్కి వేశామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధం గా నకిలీ విత్తనాలు అమ్మిన వారి పై పీడీ యాక్ట్ ప్రయోగించామని తెలిపారు. దీని కోసం చాలా సార్లు కేంద్ర మంత్రుల చూట్టు తిరిగామని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా 700 మంది రైతులను పొట్టన పెట్టు కున్నారని ఆరోపించారు. అలాగే రైతుబందు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను కూడా దేశంలో మొదటి సారి పెట్టిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.