తెలుగు దేశం ఒకప్పుడు ఎదురులేని పార్టీగా చలామణి అయిన ఈపార్టీ ఇప్పుడు తన ఉనికిని చాటుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో టీడీపీ వెంట ఉండాల్సిన కొంత మంది నాయకులు ఆధిపత్యం చలాయించేందుకు సొంత నాయకులపైనే విమర్శలకు దిగుతున్నారు.దీంతో చంద్రబాబు నాయుడు తలపట్టుకుంటున్నాడు. పార్టీలో ఉందే కొద్ది మంది అందులోనూ ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదని సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ఇది వినడానికి కొంత ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజమని వారు అంటున్నారు. ఏదైనా చర్య తీసుకుందామా అంటే పార్టీని వీడుతామని హెచ్చరిస్తుండడంతో చంద్రబాబు ఏం తోచని స్థితిలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్ననే కదా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
టీడీపీ నేతల నుంచి చంద్రబాబుకు పెరుగుతున్న డిమాండ్లు.. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదంట..
-