బీజేపీ మాయలో పడొద్దు కాంగ్రెస్ శ్రేణులకు హైకమాండ్ సూచన

-

రానున్న లోకసభ ఎన్నికలపై ప్రణాళికతో కసరత్తు చేపట్టింది కాంగ్రెస్ హై కమాండ్. సార్వత్రిక బరిలోకి దిగడానికి ముందు ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలలో తమ నాయకులు బిజెపి ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడుతోంది. బీజేపీ మాయలో పడవద్దని ఇప్పటికే హెచ్చరించింది.అదే సమయంలో ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని కూడా వారిని కోరింది.కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు., అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కుమారి షెల్జా, సీఎం భూపేష్‌ బఘేల్‌ కూడా ఈ సమావేశంలో ప్రధానంగా పాల్గొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీనియర్ పార్టీ నాయకులతో ఎన్నికల మేధోమథనం తర్వాత, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ‘గాధో నవ ఛత్తీస్‌గఢ్’ అనేది కేవలం నినాదం మాత్రమే కాదని ఛత్తీస్‌గఢ్ పురోగతి,సామాజిక న్యాయం సాధన కోసం ఒక లక్ష్యంగా పేట్టుకున్నామని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఛత్తీస్‌గఢ్ ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసమే నడిపిస్తోందని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే అంతిమ లక్ష్యమని చెప్పుకొచ్చారు.

అయితే, ఈ సమావేశం తర్వాత, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కుమారి సెల్జా కూడా రాష్ట్ర ముఖ్య నేతలతో కలిసి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. జరగబోయే ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలతో ఒక ముఖ్యమైన చర్చ జరిగినట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భాజపా ఉచ్చులో పడవద్దని పార్టీ నేతలకు సూచించారు. దీంతో పాటు అందరూ ఏకమై గత ఎన్నికల కంటే ఎక్కువ బలంతో ఎన్నికల్లో పోరాడాలని కోరారు.ఇదిలావుండగా, ముఖ్యమంత్రి పదవిపై తన వాదన గురించి తరచుగా మాట్లాడే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టిఎస్ సింగ్ దేవ్ విలేకరులతో జరిగిన చర్చలో కుటుంబంలో చిన్నపాటి విభేదాలు సాధారణమే అని చెప్పారు.ఎన్నికల్లో పోటీ చేసే ప్రశ్నకు.. పార్టీ టిక్కెట్ ఇస్తే తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version