బిగ్ బ్రేకింగ్ ;నేను ఎన్నికలు నిర్వహించలేను, కేంద్ర బలగాలు పంపండి…!

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఏకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసారు. తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఆయన కేంద్రానికి లేఖ రాసారు. కటుంబ సభ్యులతో పాటు తనపైనా దాడి జరిగే అవకాశం ఉందని, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రక్షణ కల్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.తన భద్రతతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా కేంద్ర బలగాలు అవసరమని రమేష్ కుమార్ కేంద్రానికి లేఖ రాసారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిస్థితులు అనుకూలంగా లేవని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర బలగాలు అవసరమని స్పష్టం చేసారు. అదే విధంగా రాష్ట్ర మంత్రులకు సీఎం జగన్ టార్గెట్ పెట్టడాన్ని కూడా రమేష్ కుమార్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.ఏపీలో జరిగిన ఏకగ్రీవాలపై ఆయన లేఖలో ప్రస్తావించారు. విభజన ఏపీలో ఇప్పుడు 24 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవాలు జరిగాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఒకే జడ్పీటీసీ ఏకగ్రీవం అయిందని, ఇప్పుడు 126 జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని ఆయన తన లేఖలో ప్రస్తావించడం గమనార్హం.

కడప జిల్లాలో 79 శాతం ఎంపీటీసీలు, 76 శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. సిఎం సొంత జిల్లాలో ఒక్క ఓటు వేయకుండానే జిల్లా పరిషత్ సొంతం చేసుకున్నారని, నేను హైదరాబాద్ లో ఉండేందుకు అనుమతి ఇవ్వండని, తనకు ఏపీలో ప్రాణ హాని ఉందన్నారు.రాష్ట్ర శాసన సభ స్పీకర్ కూడా నాపైన అత్యంత హీనమైన, అసభ్య పదజాలంతో దూషించారని, ఎన్నికలు వాయిదా వేసిన రోజే సిఎం సహా మంత్రులు నాపై వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version