చంద్రబాబు మాట తప్పినా… కేసీఆర్ నిలబెట్టుకున్నారు: భావోద్వేగానికి గురైన ఎర్రబెల్లి

-

ఇవాళ తెలంగాణ మంత్రి వర్గం కొలువు తీరనుంది. కొత్త మంత్రులు 10 మంది తెలంగాణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పాత వాళ్లతో పాటు కొత్త వాళ్లకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు సీఎం కేసీఆర్. కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టేవాళ్లు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు.

ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి గురయ్యారు. ఆనాడు ఎన్టీఆర్ మంత్రిగా అవకాశం కల్పించినప్పటికీ… లక్ష్మీ పార్వతి అడ్డుకున్నారని ఎర్రబెల్లి తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రిగా అవకాశం కల్పిస్తానని చెప్పారని.. కానీ.. ఆయన తన మాటను నిలబెట్టుకోలేదని తెలిపారు. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం తన మాటను నిలబెట్టుకున్నారని.. ఈసారి మంత్రి పదవి ఇస్తున్నారని.. సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణ పడి ఉంటానని ఎర్రబెల్లి తెలిపారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పర్వతగిరిలో ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మించారు. ఆయనకు ఇప్పుడు 62 ఏళ్లు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి తీసుకుంటే ఆయనే సీనియర్ ఎమ్మెల్యే. 1982లో ఎర్రబెల్లి రాజకీయ ప్రస్థానం ప్రారంభమయింది. 1999 నుంచి 2003 వరకు ఎర్రబెల్లి ప్రభుత్వ విప్ గా పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version