ఈటల జమున పేరు తో ఉన్న జమున హేచరీస్ అక్రమం గా భూములను కబ్జ చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బల్క సుమన్ అన్నాడు. ప్రభుత్వ భూముల తో పాటు ఎస్సీ, ఎస్టీల కు చెందిన అసైన్డ్ భూములను అక్రమం గా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన అన్ని సాక్ష్యాలను మెదక్ జిల్లా కలెక్టర్ మీడియా కు చూపించాడని తెలిపాడు. తప్పు రుజువు అయింది కాబట్టి ఈటల రాజేంధర్ ముక్క నెలకు రాసి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే బల్క సుమన్ డిమాండ్ చేశారు.
జమునా హేచరీస్ లో తమ తప్పు ఉంటే ముక్కు నెలకు రాసి క్షమాపణ చెబుతామని ఈటల అన్నాడని గుర్తు చేశాడు. అలాగే టీఆర్ఎస్ లో ఆరెళ్లు పదవులు అనుభవించి.. పదవులు పోయాక పార్టీ పై విమర్శలు చేయడం కొంత మందికి ఫ్యాషన్ అయిపోయిందని ఉద్యోగ సంఘం మాజీ నేత విఠల్ ను ఉద్దేశించి విమర్శించాడు. విఠల్ టీఆర్ఎస్ లో ఉన్న సమయం లో సీఎం కేసీఆర్ పదువులు ఇచ్చాడని అన్నారు.
ఆ పదువుల ను కొల్పోగానే పార్టీ పై విఠల్ విమర్శిస్తున్నాడని ఆగ్రహాం వ్యక్తం చేశాడు. అలగే వరి ధాన్యం కొనుగోలు విషయం లో టీఆర్ఎస్ ఎంపీ ల ఆందోళన ను కేంద్రం పట్టించు కోవడం లేదని విమర్శించారు. ఢిల్లీ లో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు వరి ధాన్యం గురించి కేంద్రం తో ఆందోళన చేయక పోగా.. విందులు చేసుకుంటున్నారని విమర్శించారు.