రేపే ఎమ్మెల్యే ప‌ద‌వికి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా?!

-

ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం అనేక మ‌లుపులు తిరిగి చివ‌ర‌కు బీజేపీ గూటికి చేరింది. ఇప్ప‌టికే ఆయ‌న రాష్ట్ర బీజేపీ నేత‌ల‌ను క‌లిసి, అనంత‌రం బండి సంజ‌య్ తో క‌లిసి ఢిల్లీకి వెళ్లారు. అక్క‌డ జేపీ న‌డ్డాను క‌లిసి పార్టీ ప‌ర‌మైన హామీ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈట‌ల రాజేంద‌ర్ వారంలోగా బీజేపీలో చేర‌తారంటూ బండి సంజ‌య్ క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇంకోవైపు టీఆర్ ఎస్ అధిష్టానం ఈట‌ల‌పై సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌పై పార్టీ ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్టు ఇప్ప‌టికే ఎమ్మెల్సీ రాజేశ్వ‌ర్‌రెడ్డి ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో ఈట‌ల త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి ఎప్పుడు రాజీనామా చేస్తారంటూ చ‌ర్చ సాగుతోంది.

రేపే (జూన్ 4) తేదీన ఈట‌ల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. అప్పుడే టీఆర్ఎస్‌కు కూడా గుడ్‌బై చెప్తార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. ఆ తర్వాత త్వరలోనే బీజేపీలో చేరతార‌ని అంతా చ‌ర్చిస్తున్నారు. అయితే ఆయ‌న టీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేయ‌కుండా పార్టీనే ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకునేవ‌ర‌కు వెయిట్ చేయాల‌ని భావిస్తున్నారు. అప్పుడే సింప‌తీ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు. అయితే ఇంకోవైపు లాయ‌ర్ల నుంచి న్యాయ‌ప‌ర‌మైన సూచ‌న‌లు తీసుకుంటున్నారు. మ‌రి ఆయ‌న ముందుగా బీజేపీలో చేరుతారా? లేక పార్టీ ప‌ర‌మైన చ‌ర్య‌లు టీఆర్ ఎస్ తీసుకున్నాక వెల్తారా అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version