వైసీపీలోకి మరో మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ..!

-

నాకు ఎలాంటి అనుభవం లేకపోయినా నన్ను నమ్మి ఎంపీగా అవకాశం ఇచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రుణం తీర్చుకోవడానికే వైఎస్సార్సీపీలో చేరా. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఇంకా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి.

ఎన్నికలు ఇంకా వారం రోజులే ఉన్నా ఏపీలో రాజకీయాలు మాత్రం ఇంకా మారుతూనే ఉన్నాయి. ఇప్పటికే అధికార టీడీపీకి షాకులిస్తూ టీడీపీ నేతలంతా వైసీపీకి క్యూ కడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధి రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. నంద్యాల సభలో వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. ఈసందర్భంగా జగన్.. పార్థసారధిరెడ్డికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే.. శ్రీశైలం నియోజకవర్గం నుంచి వెలుగోడు మండల జెడ్పీటీసీ, ఆయన అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు.

మరోవైపు అనంతపురం జిల్లా హిందూపురం మాజీ ఎంపీ నిజాముద్దీన్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన అనుచరులతో కలిసి ఆయన వైసీపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన జగన్‌ను కలిసి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

వైఎస్‌ఆర్ రుణం తీసుకోవడానికే వైసీపీలో చేరా…

నాకు ఎలాంటి అనుభవం లేకపోయినా నన్ను నమ్మి ఎంపీగా అవకాశం ఇచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రుణం తీర్చుకోవడానికే వైఎస్సార్సీపీలో చేరా. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఇంకా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అలాగే కొనసాగాలంటే ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి కావాలని నిజాముద్దీన్ ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version