అన్నింటికీ ఆమడ దూరంలో రాహుల్ గాంధీ.. ఎందుకు..?

-

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నింటికీ ఆమడ దూరంలో ఉంటున్నారు. అయితే ఆయన అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. గడిచిన నెల రోజుల్లో మన ఇండియాలో మూడు ప్రధాన కార్యక్రమాలు జరిగాయి. అందులో ఒక్కదానిలో కూడా రాహుల్ గాంధీ సరిగ్గా పాల్గొనకపోవడం అనేదే ఇందుకు నిదర్శనం. ఇటీవల మన 76వ గణతంత్ర దినోత్సవ సంబరాలతో పాటుగా.. ప్రస్తుతం జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్ అలాగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. అన్నింటిలో కూడా రాహుల్ గాంధీ పక్కకు ఉన్నారు. జాతీయ నాయకులు చురుగ్గా పాల్గొనే కార్యక్రమాల్లో.. రాహుల్ గాంధీ స్పష్టంగా గైర్హాజరవుతున్నారు లేదా అంటీ అంటనట్టు ఉంటున్నారు.

రిపబ్లిక్ డే పరేడ్ లో రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున్ ఖర్గే మాటవరసకు అన్నట్లు కనిపించడం.. ఆయన జాతీయ అహంకారం అలాగే ఆయన మన సైనికులకు ఇచ్చే గౌరవానికి నిదర్శనంగా ఉంది. అలాగే ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో.. ప్రతిపక్ష నాయకుడి పదవిలో ఉన్నప్పటికీ ఆయన ఎక్కడా కనిపించలేదు. ఇక 2022లో రాజ్యాంగ దినోత్సవం రోజున అధికారిక వేడుకలకు ఆయన రాకపోవడం అనేది.. ఏ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నట్లు ఆయన చెబుతున్నారో దానినే అవమానించినట్లు అయ్యింది.

ఇక మన భారతదేశ సాంస్కృతికతలో భాగమైన.. అతిపెద్ద ఆధ్యాత్మిక సమాజానికి నిదర్శనమైన మహా కుంభ్ లో కూడా రాహుల్ గాంధీ పాల్గొనలేదు. ఈ ప్రయాగ్‌రాజ్‌ లో జరుగుతున్న పవిత్ర స్నానాల కార్యక్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ నాయకులు అందరూ పాల్గొన్నారు. కానీ దీనికి కూడా రాహుల్ గాంధీ రాకపోవడం అనేది.. ఆయన మన భారత దేశ సాంస్కృతిక ప్రాముఖ్యతను విస్మరిస్తున్నట్లు తెలియజేస్తుంది.

ఇవి మాత్రమే కాదు రాహుల్ గాంధీ ఒక నాయకుడిగా కూడా విఫలం అవుతున్నారు అనడానికి నిదర్శనం.. తన సొంత పార్టీ కార్యక్రమాలు.. పార్టీ నాయకులను పట్టించుకోకపోవడం. గతంలో మధ్యప్రదేశ్ అలాగే రాజస్థాన్‌ లో కాంగ్రెస్ సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకోలేకపోయారు. అదే విధంగా బెళగావిలో పార్టీ కర్నాటక యూనిట్ ఘనంగా నిర్వహించిన మహాత్మా గాంధీ విగ్రహ ప్రారంభోత్సవ వేడుకలకు కూడా రాహుల్ దూరమయ్యారు. వీటితో పాటుగా కీలకమైన పార్టీ కార్యక్రమాలకు నిరంతరం డుమ్మా కొట్టడం.. అలాగే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా రాహుల్ యాక్టివ్ గా లేకపోవడం అనేది రాహుల్ గాంధీకి ఏమైంది అనే అనుమానాలకు దారి తీస్తుంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీని లోపల బయట రెండు చోట్ల బలహీనపరుస్తుంది అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version