ఏపీలో కాక రేపుతున్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి బహిరంగ లేఖ..

-

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వారిని టార్గెట్ చేసుకొని.. అరెస్టు చేయించేందుకు సిద్ధమవుతున్నారు.. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు వంటి నేతలు జైలులో ఉన్నారు.. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాసిన లేఖ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది..

కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనను ఇబ్బంది పెడుతున్నారు అంటూ కాకినాడ సిటి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ లేఖ రాసారు. తనపై టిడిపి ఎమ్మెల్యే కావాలనే అక్రమ కేసులు పెడుతున్నారు అంటూ మండిపడ్డారు.. ప్రశాంతంగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.. అధికారం ఉందనే అహంకారంతో ఎమ్మెల్యే కొండబాబు వ్యవహరిస్తున్నారని ఆయన రాసిన లేఖ సారాంశం..

రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు తనపై నిరధారణ ఆరోపణలు చేస్తున్నారని.. తాను ఇటువంటి బియ్యం వ్యాపారం చేయడం లేదని ఆయన వివరణ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న కక్ష సాధింపు చర్యల వల్ల 30 వేల మంది కార్మికులు నష్టపోతున్నారని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యే కొండబాబు చేస్తున్న అవినీతి అక్రమాలను ఆరు నెలల తరువాత బయటపెడతానంటూ హెచ్చరించారు..

ద్వారంపూడి రాసిన లేక ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీలో యాక్టివ్ గా ఉండే వారిని పథకం ప్రకారం ఇబ్బంది పెడుతున్నారనే టాక్ జనాల్లో పిచ్చిగా మారింది.. రాజకీయంగా ఇబ్బంది పెడితే.. నియోజకవర్గ స్థాయిలో ఆధిపత్యం వస్తుందనే ఆలోచనలో కూటమి నేతలు ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version