ఇప్పుడు తెలంగాణలో ఏదైనా రాజకీయం ఉందంటే అది ఈటల రాజేందర్ చుట్టూ మాత్రమే తిరుగుతుంది. ఎవరి నోట విన్నా, ఏ మీడియాలో అయినా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఈటల రాజేందర్ బర్తరఫ్ అయినప్పటి నుంచి ఆయన ప్రతిపక్షాలను కలుస్తున్నారు. అయితే ఆయన ఆయా పార్టీల్లో చేరతారని, అందుకు కలుస్తున్నారని అంతా అనుకుంటున్నారు.
ఇందులో భాగంగా ఆర్ ఎస్ ఎస్నుంచి ఉద్యమ నేతల వరకు అందరినీ కలుపుకుని పోతానని ఆయన చెబుతున్నారు. అంటే ఉద్యమ కారులను కూడా బీజేపీలోకి తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ ఎస్ అసంతృప్త నేతలను కూడా ఆయన వెంటే ఉంటారని ఆయన చెబుతున్నారు. అయితే ఎన్నికల ముందు వెళ్తారా లేక ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన తర్వాత వెళ్తారా అనేది క్లారిటీ లేదు.