కరోనా గురించి భయపడే వాళ్ళకి ఇంతకంటే గుడ్ న్యూస్ ఉండదు..!!

-

ప్రపంచాన్ని విలవిలలాడిస్తున్న కరోనా వైరస్ ప్రపంచంలో అన్ని ఖండాలలో వ్యాపించి ఉంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ఇటలీ దేశంలో ఎక్కువ ప్రభావం చూపుతుంది. వైరస్ వల్ల చాలామంది ఇప్పటికే ఇటలీలో మరణించడం జరిగింది. దీంతో ఇటలీ ప్రభుత్వం ప్రజలను ఇల్లు దాటి బయటికి రాకూడదని బయటకు వస్తే జైల్లోకి వెళ్లాల్సి వస్తుందని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఇండియాలో కూడా ఈ వ్యాధి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటున్న నేపథ్యంలో దేశంలో ఉన్న ప్రజలు ప్రస్తుతం భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సమయంలో కరోనా వైరస్ వల్ల భయపడుతున్న భారతీయులకు ఒక గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమిటంటే ఇటీవల ఈ వైరస్ తో బాధ పడుతున్న భార్యాభర్తలిద్దరూ ఇటీవల జైపూర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వైద్య బృందం వాళ్లకి చాలా వెరైటీగా చికిత్స చేసి తక్కువ రోజుల్లోనే వైరస్ లేకుండా చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. భారతదేశానికి టూర్ కోసం వచ్చిన 23 మంది ఇటాలియన్ సభ్యులలో ఒక జంటకు కరోనా ఉన్నట్లు గుర్తించారు.

 

ఆ భార్యాభర్తలకు భారత డాక్టర్లు అనూహ్యరీతి లో నయం చేశారు.  భారత డాక్టర్లు లోపినవిర్ మరియు రిటోనవిర్ మందులను దానితో పాటు వారు మలేరియా కోసం వాడే క్లోరోక్విన్ మరియు స్వైన్ ఫ్లూ ట్రీట్మెంట్ కు వాడే ఒసెళ్తామివిర్ నో కూడా కలిపి ఇవ్వడంతో వారి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడి చివరికి నయం కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తో బాధ పడుతున్న వివిధ దేశాల వాళ్లు జైపూర్ వైద్య బృందాన్ని సంప్రదిస్తున్నారు. ఇది నిజంగా కరోనా వైరస్ తో బాధపడుతున్న వారికి గుడ్ న్యూస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version