ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ డేస్ సేల్‌.. ఎప్పుడంటే..?

-

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరో బంప‌ర్ సేల్‌కు తెర‌తీయ‌నుంది. మార్చి 19వ తేదీ నుంచి బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో ఆ సేల్‌లో అందివ్వ‌నున్న ఆఫ‌ర్ల వివ‌రాల‌ను ఫ్లిప్‌కార్ట్ తాజాగా వెల్ల‌డించింది. మార్చి 19 నుంచి 22వ తేదీ వ‌ర‌కు ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ 2020 సేల్ జ‌ర‌గ‌నుంది.

సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, వియ‌ర‌బుల్స్‌, స్పీక‌ర్లు, స్మార్ట్ హోం ప్రోడ‌క్ట్‌లు త‌దిత‌రాల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు. ఈ క్ర‌మంలో సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల‌తో వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. అలాగే పలు కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌ను ఈ సేల్‌లో త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందివ్వ‌నున్నారు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో.. రెడ్‌మీ నోట్ 7 ప్రొ, వివో జ‌డ్‌1 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9, రియ‌ల్‌మి 5 ప్రొ, గెలాక్సీ ఎ50, ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్, ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్‌, అసుస్ 6జ‌డ్‌, గూగుల్ పిక్స‌ల్ 3ఎ, రియ‌ల్‌మి ఎక్స్2 ప్రొ, రియ‌ల్‌మి ఎక్స్‌2, వివో యూ10 త‌దిత‌ర ఫోన్ల‌ను భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందివ్వ‌నున్నారు. అలాగే ప‌లు ఫోన్ల‌పై నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం అందివ్వ‌నున్నారు. ఇక స్మార్ట్ టీవీలు, స్మార్ట్ హోం ప్రొడ‌క్ట్స్‌, వియ‌ర‌బుల్స్‌, ఆడియో గేర్ ఉత్ప‌త్తుల‌పై రాయితీల‌ను ఇవ్వ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version