మేయర్‌ ఎన్నికలో మజ్లిస్‌ వ్యూహం ఏమిటో..?

-

మేయర్, టిప్యూటీ మేయర్‌ ఎన్నికకు రోజులు దగ్గరపడుతున్న నేపథ్యంలో రోజురోజుకు ఉత్కంఠ నెలకొంటుంది. ఈ ఎన్నికలో మజ్లిస్‌ పార్టీ మద్దతే కీలకంగా మారనుంది. ఇటీవల పూర్తయిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలలో ఏ ఒక్కరికి మ్యాజిగ్‌ ఫిగర్‌ రాకపోవడంతో మేయర్ల ఎన్నిక ఓ సమస్యగా అవతరించింది. మజ్లిస్‌కు, మేయర్‌ అయ్యేంత సంఖ్యాబలం లేకపోవడంతో ఆ పదవులపై ఆశ వదులుకుంది. గతం నుంచే కారుతో చెట్టాపట్టాలు వేసుకున్న మజ్లిస్‌ గ్రేటర్‌ ఎన్నికల్లో సొంతంగా రింగ్‌లోకి దిగగా, ఇరుపార్టీల నేతలు మాటల యుద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో మద్దతు ప్రశ్నార్థకంగా మారింది.

వాకౌటా..? డుమ్మానా..?

అయితే.. బీజేపీకి మాత్రం మజ్లిస్‌ మద్దతు అసలే ఇవ్వదు. కానీ.. టీఆర్‌ఎస్‌కు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేందుకూ మజ్లిస్‌ మనస్సు ఒప్పుకోదు. అయితే వ్యతిరేకంగా ఓటేస్తారంటే అది కూడా జరగదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో పాల్గొనే దానిపై మజ్లిస్‌ పార్టీ సందిగ్ధంలో పడింది. ఎన్నికయ్యే సమయంలో సమావేశం నుంచి వాకౌట్‌ చేయాలా..? అసలు ఎన్నికకే డుమ్మా కొట్టాలా అనే దానిపై వాడివేడిగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

అంతా కలిపినా టీర్‌ఎస్‌కు 88..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ 54 స్థానాలకు గెలుచుకోగా, ఇందులో 44 మంది కార్పొరేట్లరతో పాటు 10 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలకు ఓటు హక్కు ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 193 కాగా.. కోరం సంఖ్య 97. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపితే టీఆర్‌ఎస్‌ 88 దాటకపోవడంతో మజ్లిస్‌ ప్రముఖ పాత్ర పోషించనుంది.

దారుస్సలాంలో 11 సమావేశం..

కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్‌ కోసం జరిగే ఎన్నికల ప్రక్రియకు మజ్లిస్‌ దూరంగా ఉండాలని ప్రణాళిక రూపొందించుకున్నట్లు సమాచారం. ఈ నెల 11న జరిగే దారుస్సలాంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మజ్లిస్‌ అధినేత అసదుద్దీర్‌ ఓవైసీ కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని చర్చలు చక్కర్లు కొడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version