తెలంగాణ ప్రభుత్వంలో కరెంట్ సమస్య లేకుండా చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గతంలో ఎప్పుడూ కరెంట్ గురించే చర్చ జరుగుతుండేదన్నారు. సీఎం కేసీఆర్ ఎన్ని అడిగితే అన్ని ట్రాన్స్ ఫార్మర్లు ఇచ్చారని అన్నారు.
ప్రజా జీవితంలో ఉండాలంటే.. ప్రజలకు సేవ చేయాలంటే పదవే ఉండాల్సిన అవసరం లేదు. పని చేయాలనుకుంటే ఎలాగైనా పని చేయవచ్చు. రాజకీయాల్లో పదవి విరమణ ఉండదు. మీకు ఘనంగా వీడ్కోలు చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. వీడ్కోలు అనేది పదవికే కానీ.. ప్రజా సేవకు కాదు.. మన సంబంధాలకు కాదు. మంచిగా ఆలోచించి.. మంచిగా జీవించండి.. అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న హరీశ్ రావు పై వ్యాఖ్యలు చేశారు. పదవి కాలంలో ఎంత గొప్పగా పని చేశామన్ని ముఖ్యం కాదన్నారు. పదవి కాలంలో చేసే మంచి పనులే ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. ఇదివరకు జెడ్పీల్లో, ఇప్పుడు కొత్తగా ఎన్నికైనా జెడ్పీల్లో చాలా తేడాలున్నాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో కరెంట్ సమస్య లేకుండా చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గతంలో ఎప్పుడూ కరెంట్ గురించే చర్చ జరుగుతుండేదన్నారు. సీఎం కేసీఆర్ ఎన్ని అడిగితే అన్ని ట్రాన్స్ ఫార్మర్లు ఇచ్చారని అన్నారు. ఇదివరకు మంచి నీటి సమస్య బాగా ఉండేదని.. ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చాక 90 శాతం నీటి సమస్య తీరిందన్నారు. దశాబ్దాల నుంచి కూడా జరగని ఎన్నో పనులు.. ప్రస్తుతం జెడ్పీల హయాంలో జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు.