గౌతం గంభీర్ మొదట్నుంచీ వివాద రహితుడు. క్రికెట్ ఆటలో తనదైన శైలిలో ప్రత్యర్థి జట్లపై విరుచుకు పడతాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టును ముందుండి నడిపించాడు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. గంభీర్ తన ఆటతో మైదానంలోనే కాదు, తన మానవత్వంతో మైదానం బయటా అందరి మన్ననలు పొందాడు. ఎప్పటికప్పుడు సమాజంలో ఉన్న తోటి ప్రజలకు సహాయం చేసే మంచి మనస్సున్న వ్యక్తి గంభీర్. ఈ క్రమంలోనే గంభీర్ తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచి మొదటిసారే భారీ మెజారిటీతో విజయం సాధించాడు. ఏకంగా 3,90,391 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ (కాంగ్రెస్)పై ఘన విజయం సాధించాడు.
గౌతం గంభీర్ మొదట్నుంచీ వివాద రహితుడు. క్రికెట్ ఆటలో తనదైన శైలిలో ప్రత్యర్థి జట్లపై విరుచుకు పడతాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టును ముందుండి నడిపించాడు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చాడు. గంభీర్‌కు మొదట్నుంచీ దేశభక్తి ఎక్కువ. ఎక్కడ భారత సైనికులు చనిపోయినా ముందుగా స్పందించే వ్యక్తుల్లో గంభీర్ ఉంటాడు. ఈ క్రమంలోనే చనిపోయిన జవాన్ల కుటుంబాలకు గంభీర్ సహాయం చేస్తుంటాడు.
ఇక పాకిస్థాన్ అంటే గంభీర్‌కు విపరీతమైన ఆగ్రహం. పాక్ ఉగ్రవాదులు భారత్‌లో ఎప్పుడు దాడులు జరిపినా సోషల్ మీడియా వేదికగా గంభీర్ తన గళం వినిపించేవాడు. ఈ క్రమంలోనే రాజకీయాల్లో ప్రవేశించి ప్రజలకు సేవ చేయాలని పూనుకున్నాడు. అందుకనే బీజేపీలో చేరి ఎంపీగా విజయం సాధించాడు. అయితే గంభీర్ ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు. బీజేపీ నుంచి ఎంపీ టిక్కెట్ రాగానే నామినేషన్ వేసి నేరుగా ప్రచారంలోకి దూసుకెళ్లాడు. ఇప్పుడు ఎంపీ అయ్యాడు. మరిక గంభీర్ రాజకీయాల్లోనూ గతంలో తాను ప్రదర్శించిన అగ్రెసివ్ యాటిట్యూడ్‌ను చూపిస్తాడా, లేక మృదు స్వభావిగా రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేస్తాడా, అసలు గంభీర్ ఎంపీగా ప్రజలకు ఏం చేస్తాడు… అనేది తెలుసుకోవాలంటే.. మరికొంత కాలం వేచి చూడక తప్పదు..!