రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ అంటూ తొలి అబద్ధం చెప్పిన బుగ్గనకు కంగ్రాట్స్ చెప్పండి. ఆయనే కాదు ఆయనతో పాటు ఇంకొందరికి కూడా కంగ్రాట్స్ చెప్పండ్రా! ఎందుకంటే చెప్పేదానికి వినేదానికి దేనికి అయినా సంబంధం ఒకటి ఏడ్చి ఉండాల. రెండున్నర లక్షల కోట్లలో కేటాయింపుల గోల అంతా ఫై నాన్ సెన్స్ విభాగంలో రాసుకోండి. ఉమ్మడి ఆంధ్రాకు లేని బడ్జెట్ వీళ్లకు ఎలా వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యంగా మా శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏర్పాటు చేస్తున్న (కిడ్నీ బాధితులకు ముఖ్యంగా వారి సౌకర్యార్థం) ఆస్పత్రికి నలభై కోట్లు ఇచ్చారు.
అవును వంద కోట్ల ఆస్పత్రి ఆయన గారు రెండేళ్లగా ఊసెత్తకుండా ఇప్పుడు మాత్రం నిధులు ఇచ్చి ఉదారత చాటుకున్నారు .దీనికే మంత్రి సీదిరి గొప్పగా చెబుతున్నారు. అయినా ఆయనకు తెలియదా కేటాయింపులన్నీ నిజాలు కావు. నిజాలు అయిన వేళ తప్పక సంతోషించాలి. కేటాయించిన మాత్రాన నిధులు ఉన్న పళాన విడుదల కావు.
అసలు ఈ ప్రభుత్వానికి డబ్బులు పంచడం తప్ప మరో సోయి ఉండదు అని! ఏదేమయినా ఇలాంటి నిర్ణయాలు మాత్రం అస్సలు ఆమోదయోగ్యం కావు. ఇక ప్రాజెక్టులకు కొద్దిగా నిధులున్నా అవన్నీ సకాలంలో ఇస్తారో ఇవ్వరో అన్న మీమాంస ఉంది.ముందు వంశధార ఫేజ్ 2 పనులు ప్రారంభించి చూపించండి ఇంకేం వద్దు. నిర్వాసితులను పట్టించుకోండి ఇంకేం వద్దు. ఇవి చేయకుండా గాలి మాటలు పోగేయకండి అని అంటోంది టీడీపీ.