హుజూరాబాద్ ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్ది…ఉత్కంఠ మరింత పెరిగిపోతుంది. అసలు హుజూరాబాద్‌లో ఎవరు గెలుస్తారనే అంశంపై కేవలం తెలంగాణ ప్రజలే కాదు…ఇటు ఏపీ ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే హుజూరాబాద్‌లో గెలవడానికి ఇటు ఈటల రాజేందర్….అటు అధికార టిఆర్‌ఎస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ సైతం దూకుడుగానే ప్రచారం చేస్తుంది. కానీ ప్రధాన పోరు టిఆర్‌ఎస్-ఈటల మధ్యే జరుగుతుందని ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది.
అయితే హుజూరాబాద్‌లో గెలుపుపై రకరకాల విశ్లేషణలు, సర్వేలు వస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ అనుకూలమైన సర్వేలు చెప్పుకుంటున్నాయి. ఈటల గెలుపు ఖాయమని బిజేపి…అబ్బో మాకు తిరుగులేదని టిఆర్‌ఎస్, జనం తమనే అదరిస్తారని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ వాస్తవ పరిస్తితులు కాస్త పార్టీల సర్వేలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో టిఆర్‌ఎస్ శ్రేణులు మినహా, మిగతా ప్రజలు ఈటల గెలవాలని కోరుకుంటున్నారు. హుజూరాబాద్‌లో కూడా అదే పరిస్తితి ఉంది.
కాకపోతే ప్రజలని తమవైపుకు తిప్పుకోవడానికి కేసిఆర్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కేసిఆర్ అందించిన సంక్షేమ పథకాల వల్ల…కొంతమంది ప్రజలు టిఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వస్తున్నాయి. ఇదే సమయంలో హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్..బిజేపి కంటే 13 శాతం ఓట్లు లీడ్‌లో ఉందని కేసిఆర్ చెబుతున్నారు.
అంటే ఆయన అంతర్గత సర్వేలో అలా తెలిసిందట. ఇక ఈ సర్వే ఎప్పుడు…ఎవరు చేస్తున్నారో క్లారిటీ లేదు. ఒకవేళ సర్వే చేసే వాళ్ళు టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయం తీసుకుని ఉంటారు. అందుకే 13 శాతం లీడ్ అంటున్నారు. కానీ హుజూరాబాద్‌లో ఆ పరిస్తితి ఉన్నట్లు కనిపించడం లేదు. హుజూరాబాద్‌లో కేసిఆర్ ఏం చేసినా అది ఈటల వల్లే అని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. అందుకంటే మెజారిటీ ప్రజలు ఈటల వైపే ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయం నవంబర్ 2న క్లారిటీ వచ్చేస్తుంది.