ఇంకా తేల్చని టీపీసీసీ అధిష్టానం.. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ ముగ్గురిలో ఎవరో?

-

హుజురాబాద్ బై పోల్ కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థినే ఖరారు చేయలేదు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత జరగబోయే ఈ తొలి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే, టీఆర్ఎస్ తరఫున ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆల్రెడీ ప్రచారం షురూ చేశారు. మొన్నటి వరకు సిద్దిపేట నుంచే నేతలను కో-ఆర్డినేట్ చేసిన ట్రబుల్ షూటర్ ప్రజెంట్ ఫిజికల్‌గా హుజురాబాద్‌కు వచ్చి ప్రచారంలో వేగం పెంచారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై సూటిగానే విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హుజురాబాద్ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. కాగా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితే ఇంకా ఎటూ తేలడం లేదు.

కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇటీవల ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు స్వర్గం రవి, ఇంకా కొందరు కూడా టీఆర్ఎస్‌కు వెళ్లగా, కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉండబోయే అభ్యర్థి ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాకు చెందిన మహిళా నేత కొండా సురేఖ, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, దొమ్మాటి సాంబయ్య పేర్లను టీపీసీసీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి..ఈ ముగ్గురిలో ఎవరిని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ టికెట్ ఎవరిని వరించేనో.. అయితే, ఇంకా ఎక్కువ కాలం వెయిట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకే నష్టం జరుగుతుందన్న అభిప్రాయం కొందరు ద్వితీయశ్రేణి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి వ్యక్తమవుతున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version