జనసేన, బిజెపి కలిస్తే, జగన్ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది…?

-

ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఇప్పుడు తన ప్రయాణం విషయంలో ఒక స్పష్టత ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పర్యటనల ద్వారా ఇవ్వాల్సిన సంకేతాలు ఇచ్చేసారు. రాష్ట్రంలో జనసేన, బిజెపి కలిసి ముందుకి వెళ్తాయి అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడు ఆ విధంగానే జనసేన అధినేత అడుగులు వేస్తున్నారు అనేది అర్ధమవుతుంది.

ఆర్ ఎస్ ఎస్ నేతలతో పాటుగా బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాతో సమావేశమైన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో బిజెపితో కలిసి వెళ్లేందుకు గాను ఆసక్తి చూపించారు. ముందు నుంచి బిజెపికి దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ విధంగానే తన ప్రయాణం కొనసాగించడానికి సిద్దమయ్యారు. ఇప్పటికే రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి కూడా వచ్చేసినట్టే కనపడుతుంది.

అయితే ఇక్కడ బిజెపి, పవన్ కలిస్తే జగన్ ఇబ్బంది పడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే జగన్ మీద దూకుడుగా వెళ్తున్న జనసేన అధినేత ఇప్పుడు ఆ దూకుడు మరింత పెంచే అవకాశం ఉంది. అప్పుడు జగన్ గాని వైసీపీ నేతలు గాని ఆయన్ను నేరుగా ఏమీ అనలేని పరిస్థితి ఉంటుంది. పొత్తు పెట్టుకున్నా అనవచ్చు ఏమో గాని, విలీనం చేస్తే మాత్రం పవన్ ని అనే సాహస౦ వైసీపీ నేతలు చేసే అవకాశాలు ఎంత మాత్రం లేవు అనేది వాస్తవం.

మంత్రులు ఇప్పుడు పవన్ విషయంలో ఒంటి కాలు మీద లేస్తున్నారు. భవిష్యత్తులో అది తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే బిజెపి నేతల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు. భవిష్యత్తులో పోరాటాల విషయంలో తెలుగుదేశంతో జనసేన బిజెపి కలిసే అవకాశ౦ లేకపోలేదు. అదే జరిగితే రాజకీయంగా జగన్ కి ఇబ్బంది ఎదురయ్యే అవకాశ౦ ఉంది. ఇప్పటికే జగన్ కి ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా ముందుకి వెళ్ళినా నష్టపోయేది జగనే.

Read more RELATED
Recommended to you

Exit mobile version