తెలంగాణాలో మళ్ళీ ఎన్నికలు…!

-

మున్సిపల్ ఎన్నికల హడావుడి ఇంకా తొలగిపోక ముందే తెలంగాణాలో మరో ఎన్నికల హడావుడి నెలకొంది. మున్సిపల్ ఎన్నికలు అయి ఊపిరి పీల్చుకున్న పార్టీలకు మరో చిన్న సవాల్ ఎదురైంది. అధికార పార్టీ సంబరాలు చేసుకుంటుంటే, కాంగ్రెస్, బిజెపి సహా ఇతర పార్టీలు ఆందోళనలో ఉంటే మరో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. త్వరలో మరో ఎన్నికలు ఉన్నాయి.

రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణాలో సహకార సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి ఆరు నుంచి 8 వరకు నోటిఫికేషన్లను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 9 న నామినేషన్ల పరిశీలన అనేది ఉంటుంది. ఫిబ్రవరి 10 న నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 15న పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఎన్నికల ఫలితాలు కూడా విడుదల చేస్తుంది ఎన్నికల సంఘం.

ఇటీవల జరిగిన తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో విపక్షాలకు ఊహించని షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి ఎలా అయినా సరే తెరాస కు షాక్ ఇవ్వాలని బిజెపి వ్యూహాలు సిద్దం చేసినా సరే నిలబెట్టడానికి అభ్యర్ధులు కూడా దొరకక ఇబ్బంది పడిన పరిస్థితి ఏర్పడింది. దీనితో ఎన్నికల్లో నాలుగు మున్సిపాలిటీలను కూడా ఆ పార్టీ గెలవలేకపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version