ఆసక్తికరంగా ఖమ్మం రాజకీయం..ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు.!

-

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు బాగా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ముందు నుంచి అధికార బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు నడుస్తోంది..అటు బీజేపీ ఇక్కడ నేతలకు గేలం వేసి బలపడాలని చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ తమ పట్టు నిలుపుకోవాలని చూస్తుంది. ఇటు షర్మిల సైతం ఖమ్మంలోని పాలేరులో పోటీకి రెడీ అవుతున్నారు. ఇక ఇటీవల చంద్రబాబు రీ ఎంట్రీ ఇచ్చి..ఖమ్మంలో భారీ సభ పెట్టి టీడీపీకి కొత్త ఊపు తీసుకొచ్చారు.

ఇలా జిల్లాలో రకరకాల సమీకరణాలు నడుస్తున్నాయి. ఇదే క్రమంలో జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..బీజేపీలో చేరడానికి రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈయనతో పాటు కొందరు నేతలు బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారు..ఈ నేపథ్యంలో ఆయన జంప్ చేయవచ్చని ప్రచారం వస్తుంది.

ఈ మధ్య ఆయన టీడీపీ సభల్లో ఎక్కువ కనిపిస్తున్నారు. ఇటు బీజేపీ ఏమో..బీఆర్ఎస్, కాంగ్రెస్  పార్టీల్లో ఉన్న నాయకులని లాగి ఖమ్మంలో బలపడాలని ప్లాన్ చేస్తుంది. ఇలా రాజకీయం నడుస్తుండగానే…ఈ నెల 18న పొంగులేటి..అమిత్ షాని కలిసి బీజేపీలోకి వచ్చేందుకు చర్చిస్తారని ప్రచారం వస్తుంది. అటు అదే తేదీన కేసీఆర్ ఖమ్మంలో పర్యటించనున్నారు. ఇక ఆ రోజు కేసీఆర్‌తో పాటు ఎవరు ఉంటారో…ఎవరు ఉండరో తేలిపోతుంది.

అలాగే జిల్లాలో టీడీపీ కూడా యాక్టివ్ అయింది..అక్కడ దూకుడుగా ముందుకెళ్లెలా ప్లాన్ చేస్తుంది. మరోవైపు షర్మిల సైతం ఖమ్మంపైనే ఫోకస్ పెట్టారు. ఆ జిల్లాలోని పాలేరు స్థానంలో పోటీ చేయాలని చూస్తున్నారు. మొత్తానికి ఖమ్మంలో రాజకీయాలు ఆసక్తిగా నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version