ఒక్క రైతుబంధు పెట్టి 10 పథకాలు రద్దు చేశారు – బూర నర్సయ్య గౌడ్

-

బిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బిజెపి నేత బూర నర్సయ్య గౌడ్. ఒక రైతు బందు పెట్టీ పది పథకాలు రద్దు చేశారని ఆరోపించారు. కేంద్ర రైతు పథకాలు ఈ ప్రభుత్వం రైతులకు అందనియడం లేదన్నారు. రైతు రుణమాఫీ చేయడం లేదని మండిపడ్డారు బూర నర్సయ్య. ఆయిల్ ఫార్మ్ కు కేంద్రము సబ్సిడీ ఇస్తుందని.. ఇది రైతులకు ప్రభుత్వం చెప్పడం లేదన్నారు.

2014 నుండి తెలంగాణ అప్పు 6 రెట్లు పెరిగిందని.. భారత దేశ అప్పు రెండింతలు పెరిగిందన్నారు. మూడు చెక్ డ్యాం లు తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమి లేదన్నారు. మోడీ గతి శక్తిని నమ్ముకుంటే కెసిఆర్ ఉచిత శక్తిని వాడుకున్నారని ఆరోపించారు. ఎంబీబీఎస్ సీట్ల ఫీజు తగ్గడానికి, ఎక్కువ రాంక్ వచ్చిన వారు సీట్లు రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనన్నారు. కోటి ఓట్లు.. 90 సీట్లు.. ప్రగతి భవన్ లో స్లాట్ ఇది బిజెపి నినాదం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version