ఫైర్ బ్రాండ్ నాయకుడు, మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు వినిపి స్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్‌కు చేరుకున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రజలకు అన్ని విధా లా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాల బ్లాక్ మార్కెటింగ్ సోమవా రమే ప్రా రంభమైంది. దీంతో అన్నింటి ధరలూ కూడా అధికంగా పెరిగిపోయాయి. ఒకపక్క, పనులు లేక, చేతిలో చిల్లిగవ్వ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో నిత్యావసరాలను కట్టడి చేసేందుకు మంత్రి తనదైన శైలిలో నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఇక, ఇప్పటికే నాని స్పందిస్తూ.. ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని వ్యాపారస్తులు నిత్యావసర వస్తు వులను అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వ్యా పారులపై కేసులు నమోదు చేయడమే కాకుండా అవసరమైతే జైలుకు పంపుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపునకు ప్రజలంతా సహకరిస్తే వారికి, దేశానికి మంచిదని కొడాలి నాని పేర్కొ న్నారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితిలో మాటలు చెబితే కుదరదని, రంగంలోకి దిగి, ఎక్కడికక్కడ తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని గమనించిన నెటిజన్లు ఆయా పరిస్థితులను ఏకరువు పెడుతూ.. మంత్రికి సోషల్ మీడియా ద్వారా విన్నపాలు పంపించారు. వెంటనే రంగంలో దిగాలని ప్రజలు ముక్త కంఠంతో కోరారు. కూరగాయల ధరలు, నిత్యావసరాల ధరలు పెంచుతుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.15 ఉన్న కిలో టమాటా సోమవారం ఏకంగా రూ.80కి చేరడం, మంచి నూనెల ధరలు కూడా లీటర్‌కు రూ.50 చొప్పున పెంచడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంత్రికి మెసేజ్ రూపంలో పంపారు. కొందరు మాత్రం సటైర్లు వేశారు. వాటిలోనూ సార్.. మిగితా అప్పుడు రెచ్చిపోవడం కాదు.. మీ సత్తా ఏంటో ఇప్పుడు చూపించాలి! అని వ్యాఖ్యానించారు. మరి కొడాలి ఏం చేస్తారో చూడాలి.