కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకనం ఆలస్యమైన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఇంటర్ ఫలితాలు ఎప్పుడొస్తాయా అంటూ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అలాగే వారి తల్లిదండ్రులు కూడా. అయితే ఇకపై దాని గురించి ఎదురుచూడనవసరం లేదని తెలుస్తుంది. ఎందుకంటే రేపు ఇంటర్మీడియెట్ ఫలితాలను విడుదల చేయబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 11 గంటల సమయంలో మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే పరీక్షల్లో ఫేయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు, ఇంప్రూవ్ మెంట్ పరీక్షల తేదీలను మాత్రం ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. పరీక్షల ఫలితాలను విడుదల చేసిన తర్వాత అధికారులు ఈ తేదీలను ప్రకటించనున్నట్లు సమాచారం.