అన్నింటా ఇరుక్కున్న చంద్రబాబు ని అతిపెద్ద ఊబిలో పడేసిన టీడీపీ కీలక నేత !

-

టిడిపి అధినేత చంద్రబాబు కి రోజు రోజుకి దెబ్బమీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒకవైపు స్థానిక ఎన్నికలు మరోవైపు పార్టీ నుండి నేతలు అధికార పార్టీ లోకి వెళ్లిపోవడంతో తల పట్టుకుంటున్న చంద్రబాబు కి పార్టీలో ఉన్న నాయకులు మరింత తలనొప్పి తీసుకువస్తున్నారు. ఇక విషయంలోకి వెళితే పలమనేరు నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీకి చెందిన మామడుగు కామాక్షమ్మ అనే మహిళ నామినేషన్ ముందుగా వేసిందట. ఆ తర్వాత ఆమె అనుకోకుండా నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని అనుకున్నారట. అటువంటి టైమ్ లో ఆమెను అడ్డుకోవటానికి సొంత పార్టీ నేతలు ఒత్తిడి తీసుకువస్తూ ఆమెను అడ్డుకున్నారు.ఇటువంటి తరుణంలో వెంటనే ఆ మహిళ పోలీసులకు సమాచారం ఇవ్వటం జరిగింది. ఇదే సమయం లో టిడిపి పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు పలమనేరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి ఆ ప్రాంతం లో అడుగు పెట్టి ఆ మహిళను ఇబ్బందులకు గురి చేస్తూ అక్కడే ఉన్న పోలీసులపై బండ బూతులు తిడుతూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ తతంగం మొత్తం అక్కడ ఉన్న పోలీసులు అంతా వీడియో రూపంలో చిత్రీకరణ చేయడంతో…తెలుగుదేశం పార్టీ పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయింది.

కావాలని పోలీసులు వైసీపీకి సహకరిస్తున్నట్లు గా పలమనేరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి ఆరోపణలు చేస్తున్న తరుణంలో పోలీసులు అసలు జరిగిన వీడియో బయటపెట్టాలని రెడీ అయ్యారు. దీంతో ప్రతి చోట ఇరుక్కు పోతున్నా చంద్రబాబు ఈ వీడియోతో అతిపెద్ద ఊబిలో పడిపోయినట్లు అయ్యింది. కావాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేతలే గొడవలు సృష్టిస్తున్నట్లు ఆ వీడియో బట్టి అర్థమవుతుంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version