కామారెడ్డిలో కేసీఆర్ పోటీ? ఛాన్స్ ఉందా?

-

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సి‌ఎం కే‌సి‌ఆర్ పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ నెలకొంది. ఈ సారి ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేయరని ప్రచారం జరుగుతుంది. గత రెండు ఎన్నికల్లో కే‌సి‌ఆర్..గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ సారి అక్కడ నుంచి పోటీ చేయరని పోలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కానీ అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మాత్రం క్లారిటీ లేదు.

ఇప్పటికే ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేయరని. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి కాబట్టి..ఎంపీగా బరిలో ఉంటారని కొందరు అంటున్నారు. కాకపోతే ముందు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి..పార్టీ అధికారంలోకి వస్తే సి‌ఎంగా ప్రమాణం చేసి..పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిస్తే..సి‌ఎం పదవిని కే‌టి‌ఆర్‌కు అప్పగించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకు జరుగుతుందో చెప్పలేం. ఆ విషయం పక్కన పెడితే..ప్రస్తుతం కే‌సి‌ఆర్ నల్గొండ జిల్లాలో ఏదొక సీటులో పోటీ చేస్తారని మొదట ప్రచారం జరిగింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో పోటీ చేస్తారని ప్రచారం వస్తుంది. తాజాగా కామారెడ్డి బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో కే‌సి‌ఆర్ కామారెడ్డి నుంచే పోటీ చేస్తారని అంటున్నారు. తాను కార్యకర్త లాగా పనిచేసి కే‌సి‌ఆర్‌ని గెలిపించుకుంటానని అంటున్నారు. పూర్వం కే‌సి‌ఆర్ సొంత వూరు కామారెడ్డిలోనే ఉండేదని, అందుకే కే‌సి‌ఆర్‌ని ఇక్కడే పోటీ చేయాలని పలుమార్లు కోరినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

అయితే కే‌సి‌ఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తే ఓడిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అంటున్నారు. ఇలా కే‌సి‌ఆర్ కామారెడ్డిలో పోటీ చేయడంపై చర్చ సాగుతుంది. కానీ ఇంతవరకు ఈ అంశంపై బి‌ఆర్‌ఎస్ లో ఎలాంటి చర్చా లేదు. కే‌సి‌ఆర్ ఎక్కడ పోటీ చేస్తారో క్లారిటీ లేదు. కాబట్టి అధికారిక ప్రకటన వచ్చేవరకు కామారెడ్డిలో కే‌సి‌ఆర్ పోటీ అనేది ఊహాజనితమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version