దేశంలో ప్రధాని మోడీ వేవ్ క్రమంగా మసగబారుతుంది..2014 ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత తిరుగులేని నేతగా ఎదిగిన మోడీ..2019 లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు..ఈ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసినప్పటికి సొంతంగా మేజార్టీ సీట్లు సాధించింది..2014 నుంచి 2020 ప్రారంభం వరకూ మోడీ దేశంలోనే ప్రభావవంతమైన ప్రధానిగా నిలిచారు..ప్రపంచ దేశాలు మోడీ పాలన దక్షతకు ఫిదా అయ్యాయి..సమాయానుకు నిర్ణయాలు తీసుకోవడం..ప్రతిపక్షాల మద్దతూను కూడగట్టగడంతో మోడీ-షా ద్వయం విజయం సాధించారు..అద్దరి నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి..జీఎస్టీ చట్టం, ఆర్టికల్ 370 రద్దు, పెద్దనోట్ల రద్దు వంటి చారిత్రామ్మక నిర్ణయాలు తీసుకున్నారు.
కేంద్రంలో మోడీ సారథ్యంలో బలమైన ప్రభుత్వం ఉండటంతో రాష్ట్రా ప్రభుత్వాలు కూడా మోడీ నిర్ణయాలపై పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు..కేంద్ర రాష్ట్రాల మధ్య అనేక వివాధాలు ఉన్నప్పటికి మోడీ పాలనపై ఉన్న నమ్మకంతో చాలా రాష్ట్రాలు మోడీ మద్దతుగా నిలచారు..2104 ఎన్నికల తర్వాత జరిగిన చాలా ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గెలుపొందాయి..అది కేవలం మోడీ వేవ్‌గానే చెప్పుకున్నారు..బలమైన నాయకుడు దేశానికి అవరమని ఆయా ఎన్నికల ద్వారా ప్రజలు స్పష్టం చేశారు..క్రమంగా దేశంలో ఆర్థిక పరిస్థితి మందగించడం..కేంద్రం తీసుకువచ్చిన నిర్ణయాలు తిరోగమన ఫలితాలు ఇవ్వడంతో బీజేపీ ప్రభుత్వం, మోడీపై ప్రజల్లో అసంతృప్తి మొదలైంది..బీజేపీ మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందంటున్నారు.దీంతో 2020 ప్రారంభంలో జరిగిన ఉప ఎన్నికల నుంచి బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి..సాధారణ ఎన్నికల గెలుపు ఊపులో ఉన్న..మిత్ర పక్షాల నుంచి బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.ముఖ్యంగా గత రెండేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్నా రైతు వ్యతిరేక విధానాలు, కొత్త వ్యవసాయ,విద్యుత్ చట్టాలు ఎన్డీఏ కూటమిలో చిచ్చు పెడుతున్నాయి..దేశంలో బీజేపీ పాలపై ప్రజల్లో క్రమంగా వ్యతిరేక మొదలైందంటున్నారు నిపుణులు..ఇప్పటికే అకాళీదళ్ బయటకు వెళ్ళిపోగా.., ఇపుడు రాజస్థాన్‌కు చెందిన ఎన్డీఏ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ కూడా బీజేపీకి అల్టిమేటం జారీ చేసింది..కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని ఆ పార్టీ ఎంపీ హనుమాన్ బేనివాల్ హోం మంత్రి అమిత్ షాకు ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. వెంటనే రైతులతో చర్చలు జరపాలని ఆయన కోరారు..ఎన్డీఏలో తాము భాగస్వామ్య పక్షాలే.. కాని రైతుల, సైనికుల విషయానికి వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని, లేక పక్షంలో ఎన్డీఏలో ఉండాలా వద్దా అన్న అంశాన్ని పరిశీలిస్తామని బేనివాల్ అన్నారు.పంజాబ్ రైతులు చేస్తున్న పోరాటం ఇప్పుడు రాజకీయంగా అనేక మార్పులకు దారీ తీస్తున్నాయి..చాలా బీజేపేత రాష్ట్రాల్లో రైతులు కేంద్రం తీరుపై గుర్రుగా ఉన్నాయి..కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యంగా హర్యానా,యూపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది..కేంద్రం తీసుకువచ్చిన చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు..దేశంలో చాలా రాష్ట్రాల్లో రైతులకు మద్ధతూగా ధర్నాలు చేస్తున్నారు..వచ్చే ఏడాది దక్షిణ భారత దేశంలో కీలకమైన రాష్ట్రం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై రైతుల పోరాట ప్రభావం తప్పకుండా ఉంటుందంటున్నారు విశ్లేషకులు..గతంలో మద్దతు ధర కోరుతూ ఢిల్లీలో తమిళ రైతులు చాలా రోజులపాటు ధర్నాలు చేశారు..పుర్రెలు,హస్తిపంజరాలతో వినూత్నంగా నిరసనలు చేశారు..అప్పట్ల్లో అది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది..
రైతుల ధర్నాలతో దిగివచ్చిన కేంద్రం మద్దతు ధరపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు..ఇప్పుడు పంజాబ్ రైతులు ఆందోళనతో దేశం మొత్తం రైతులకు మద్దతుగా నిలుస్తుంది.కేంద్రం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోకపోతే రైతులు పోరాటం మరో స్టేజీకి చేరే ప్రమాదం ఉందని..దాని వల్ల దేశంలో అనేక సమస్యలుకు కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆర్ఠిక,రాజకీయవేత్తలు..బీజేపీ మేల్కోవాల్సిన సమయం వచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఇంకా బాగా పనిచేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయినా ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు.