గ్రేటర్‌లో గులాబీదళంకు తమ్ముళ్ళ సెగలు.!

-

చంద్రబాబు అరెస్ట్ ప్రభావం తెలంగాణ రాజకీయాలపై కూడా ఉంటుందా? అంటే కొంతమేర ఉండేలా కనిపిస్తోంది.వాస్తవానికి తెలంగాణలో కూడా టి‌డి‌పి ఉంది..కాకపోతే బలమైన పార్టీగా లేదు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే బలం లేదు. టి‌డి‌పిలో మెజారిటీ నాయకులు, ఓటు బ్యాంక్ బి‌ఆర్‌ఎస్ వైపు వెళ్లింది. కొంత కాంగ్రెస్ వైపుకు వెళ్లింది. ఏదో 2-3 శాతం మాత్రం టి‌డి‌పికి ఓటు బ్యాంక్ ఉండే ఛాన్స్ ఉంది. కాకపోతే 2018 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే ఏపీ సెటిలర్లు పూర్తిగా బి‌ఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపారు.

సెటిలర్లు అంటే టి‌డి‌పి,వైసీపీ, జనసేనలని అభిమానించే వారు ఉన్నారు. వీరిలో టి‌డి‌పి మద్ధతుదారులు కాస్త ఎక్కువగా ఉంటారనే అంచనా ఉంది. ముఖ్యంగా సనత్‌నగర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గాల్లో కాస్త ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఈ పరిధిలో ఉండే ఐటీ ఉద్యోగులు తాజాగా బాబు అరెస్ట్‌కు నిరసనగా రోడ్లు ఎక్కారు. దీంతో బాబు అరెస్ట్ ప్రభావం కాస్త గ్రేటర్ హైదరాబాద్ లో ఉందని అర్ధమైంది.

ఇక వారు ఇప్పటివరకు బి‌ఆర్‌ఎస్‌కు మద్ధతు ఇచ్చారు. కానీ బి‌ఆర్‌ఎస్ బాబు అరెస్ట్ పై స్పందన లేదు..పైగా కే‌సి‌ఆర్..జగన్‌తో సన్నిహితంగా ఉన్నారు. ఇటు బాబు అరెస్ట్ వెనుక బి‌జే‌పి కూడా ఉందని తమ్ముళ్ళు నమ్ముతున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని అభిమానించే వారు బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిల వైపు మొగ్గు చూపే అవకాశాలు తక్కువగానే ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మొన్నటివరకు గ్రేటర్ పరిధిలో టి‌డి‌పిని అభిమానించే వారు బి‌ఆర్‌ఎస్‌కు మద్ధతు ఇచ్చారు. కానీ ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ వైఖరి బాబుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో..ఈ సారి తెలుగు తమ్ముళ్ళు బి‌ఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే గ్రేటర్ పరిధిలో కారుకు తమ్ముళ్ళ డ్యామేజ్ ఎక్కువగానే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version