కేరళ హైకోర్టు తీర్పు: రహస్యంగా పోర్న్‌ చూడటం తప్పేం కాదు.. పోలీసులు జోక్యం చేసుకోవడమే తప్పు

-

ఒకప్పుడు యూట్యూబ్‌లోనే పోర్న్‌ వీడియోస్‌ ఉండేవి. కానీ ప్రభుత్వం వాటిని బ్యాన్‌ చేసింది. చూసేవాళ్లకు దారులు కరువా అన్నట్లు.. వాళ్లు సైట్లు వాళ్లకు ఉన్నాయి. వాటిని చూసేవాళ్లు ఎలాగూ చూస్తున్నారు. పోర్న్‌ చూడటం నేర అని కొన్ని రాష్ట్రాల్లో అయితే కేసులు కూడా నమోదు చేస్తారు. కానీ కేరళ హైకోర్టు వీటిపై సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఇటీవల జరిగిన ఒక కేసులో ఇచ్చిన తీర్పు ఇది.

రహస్యంగా పోర్న్‌ ఫొటోలు, వీడియోలు చూడటం వ్యక్తిగతమని, అటువంటి ఘటనలపై కేసు నమోదు చేయడం చట్టరీత్యా చెల్లదని, అలా చేస్తే వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడంతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకున్నట్లే అవుతుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

 

పోర్నోగ్రఫీ అనేది శతాబ్దాలుగా కొనసాగుతోంది , డిజిటల్‌ యుగంలో ఇది మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చిందని న్యాయమూర్తి జస్టిస్‌ పీవీ కున్హికృష్ణన్‌ తెలిపారు. ఈ క్రమంలో.. పోర్న్‌ చూసే వాళ్లపై కేసులు నమోదు చేయడం అనేది నేరమే అవుతుంది. అది వారి వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగించినట్లే అని కోర్టు అభిప్రాయ పడింది. అసలేం జరిగిందంటే 2016లో కొచ్చిలోని అలువా ప్యాలెస్‌ సమీపంలో రోడ్డు పక్కన 33ఏళ్ల వ్యక్తి పోర్న్‌ చూస్తూ పోలీసులకు దొరికాడు. దీంతో ఐపీసీ 292 కింద వారు కేసు నమోదు చేశారు. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఫైనల్‌గా కోర్టు ఇచ్చిన తీర్పుతో నిందితుడిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేశారు. అది జరిగింది.

పోర్న్‌ చూడడం అనేది నేరం కాదు.. ప్రతి మనిషికి సెక్స్‌ ఎడ్యుకేషన్‌ మీద అవగాహన ఉండాలి. కానీ మితిమీర కూడదు. దానికి బానిసలు అయితే.. జీవితంలో వెనక్కు వెళ్లిపోతారు. కేరీర్‌ను చేతులారా నాశనం చేసుకున్నట్లు అవుతుంది. మనిషన్నాక.. శృంగారంలో పాల్గొనడం అనేది సాధారణమైన విషయం. అది అడవిరాజైనా.. అడుక్కుతినేవాడైనా చేస్తాడు. అదొక్కటే పనిగా వీడియోల మీద వీడియోలు చూస్తే ఎట్లా..? ముఖ్యంగా చిన్నవయసులోనే వీటికి అలవాటు పడి చదువుపాడుచేసుకోవడం, నేరాలు చేయడం లాంటివి చేస్తారనే ప్రభుత్వాలు పబ్లిక్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లో పోర్న్‌ను బ్యాన్‌ చేశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version